6 Died: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం.. బ్రిడ్జిపై నుంచి పడిన ట్రాక్టర్ ట్రాలీ, 6 మృతి!

రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు.

Published By: HashtagU Telugu Desk
Tractor

Tractor

దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)  లోని షాజహాన్‌పూర్‌లో వంతెనపై నుంచి ట్రాక్టర్-ట్రాలీ పడిపోవడంతో కనీసం ఆరుగురు మృతి (Died) చెందగా, మరో పది మంది గాయపడ్డారు (Injured). క్షతగాత్రులను స్థానికులు రక్షించి సమీపంలోని జిల్లా ఆసుపత్రి (Hospital)కి తరలించారు. రాష్ట్రంలోని తిల్హర్‌లోని బిర్‌సింగ్‌పూర్ గ్రామంలో వంతెనపై నుంచి గర్రా నదిలో ట్రాక్టర్ ట్రాలీ (Tractor) పడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు (Police) ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రాయ్‌గఢ్‌లోని ఖోపోలీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం.

Also Read: 125 Ft Statue: జయహో అంబేద్కర్.. వరల్డ్ రికార్డ్ లో కెక్కిన మన అంబేద్కర్ విగ్రహం!

  Last Updated: 15 Apr 2023, 05:18 PM IST