Revanth Rachabanda: రైతన్నకు అండగా ‘రచ్చబండ’

ఉద్యమ నేత ఆచార్య జయశంకర్ స్వగ్రామం లో రచ్చబండ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

  • Written By:
  • Updated On - May 20, 2022 / 07:59 PM IST

తెలంగాణ ఉద్యమ నేత ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేట లో రేపు రైతు రచ్చబండ కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలోని అక్కంపేట లో రేపు రైతు రచ్చబండ కార్యక్రమం జరగబోయే కార్యక్రమానికి హాజరుకానున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి, గాంధీభవన్ లో రాజీవ్ చిత్రపటానికి నివాళులు అర్పించి అక్కంపల్లి కి బయలుదేరుతారు.

మధ్యాహ్నం 1 గంటకు అక్కపల్లికి చేరుకొని రైతు రచ్చబండ లో పాల్గొంటారు. రాజీవ్ గాంధీ వర్దంతి మే 21 నుంచి నెల రోజుల పాటు రైతు రచ్చబండ జరగనున్నాయి. ఈ నెల 6వ తేదీన వరంగల్ లో జరిగిన రైతు సంఘర్షణ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు పాల్గొని రైతు డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రైతు రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టినట్టు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రేవంత్ రెడ్డి మంచిర్యాల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కుటుంబం కాంగ్రెస్ లో చేరేలా మాస్టర్ ప్లాన్ వేసి సక్సెస్ అయ్యాడు.  ఇప్పటికే ఆకర్ష్ పేరుతో చేరికలపై గురి పెట్టిన ఆయన రచ్చబండ ద్వారా రైతుల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. రైతు మద్దతు కూడగడుతూ.. రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముమ్మర ప్రచారం మొదలుపెట్టనున్నారు. కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమానికి మంచి ఆదరణ వస్తే.. అధికార పార్టీ టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చినట్టే అవుతుంది.

టీకాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమాలివే

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నెదునూరు గ్రామంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు పాల్గొంటారు.

కొమురవల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం లో పాల్గొననున్న పొన్నాల లక్ష్మయ్య

హుజూర్ నగర్ లోని చింతలపాలెం మండలం బుగ్గ మాదారం గ్రామంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు..

జగిత్యాల మండలం పొలాస గ్రామంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

జహీరాబాద్ నియోజక వర్గంలో న్యాల్ కల్ మండల కేంద్రంలో వర్కింగ్ ప్రసిడెంట్ గీతారెడ్డి పాల్గొంటారు.

కామారెడ్డి రూరల్ మండలం లోని గూడెం గ్రామంలో పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ గారు పాల్గొంటారు.

సంగారెడ్డి నియోజక వర్గంలో జగ్గారెడ్డి..

కరీంనగర్ లోకసభ పరిధిలోని నగునూరు గ్రామంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొంటారు.