ఒకవైపు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో దూకుడు ప్రదర్శిస్తుంటే, మరోవైపు టీకాంగ్రెస్ విలవిలాడుతోంది. ఆ పార్టీలో కిందిస్థాయి నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ కు సిద్ధమయ్యారు. ‘మన మునుగోడు-మన కాంగ్రెస్’ పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. శనివారం మునుగోడు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు. వివిధ మార్గాల్లో మూడు పాదయాత్రలు నిర్వహించి ఒకే రోజు ఐదు మండలాలను కవర్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ భావిస్తున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా శనివారం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఎగురవేసి రాజీవ్ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు.
అయితే రేవంత్ ఆగస్ట్ 13 న నారాయణపూర్ నుండి చౌటుప్పల్ వరకు పాదయాత్ర ప్రారంభించాల్సి ఉంది. ఆయన కోవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో వాయిదా పడింది. కాగా ఆగస్టు 20న మునుగోడులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, 21వ తేదీల్లో కేంద్రమంత్రి అమిత్‌షా బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. మునుగోడు ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా సమక్షంలో అధికారికంగా బీజేపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీల ‘ఆపరేషన్ ఆకర్ష్’ ను ఏవిధంగా ఫేస్ చేస్తారోనని ఇతర పార్టీల నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మన మునుగోడు… మన కాంగ్రెస్…#ManaMunugodeManaCongress pic.twitter.com/qrfflErQrG
— Revanth Reddy (@revanth_anumula) August 19, 2022