Munugodu Politics: ఒక క్లారిటీ-మ‌రో ఛాలెంజ్‌! చండూరు చౌర‌స్తా హీట్‌!!

పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా దానిలో అర్థం ప‌ర‌మార్థం ఉంటుంది.

  • Written By:
  • Updated On - August 5, 2022 / 01:36 PM IST

పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా దానిలో అర్థం ప‌ర‌మార్థం ఉంటుంది. కోమ‌ట‌రెడ్డి రెడ్డి వెంక‌ట‌రెడ్డికి క్లారిటీ ఇస్తూనే రాజ‌గోపాల్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. బ‌హిరంగ క్ష‌మాప‌ణ వెంక‌ట‌రెడ్డి కోరిన‌ప్ప‌టికీ దాన్ని చాక‌చ‌క్యంగా దాట‌వేస్తూ రాజ‌గోపాల్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ శుక్ర‌వారం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సరికొత్త చ‌ర్చ‌కు దారితీసింది. రెండు రోజుల క్రితం ఆస్తుల‌పై ఛాలెంజ్ చేసిన రాజ‌గోపాల్ రెడ్డికి ప్ర‌తిగా రేవంత్ స‌వాల్ విసిరారు. చండూరు చౌర‌స్తాలో బ‌హిరంగ చ‌ర్చ ద్వారా `నువ్వు ఈ స్థాయికి ఎలా వ‌చ్చావ్, ఎన్ని కాంట్రాక్టులు ఎలా పొందావో ..`చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ ఛాలెంజ్ చేశారు. ఎంగిలిమెతుకుల కోసం రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీకి వెళుతున్నార‌ని మూడు రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదిక‌గా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ లేక‌పోతే `కోమ‌టిరెడ్డి` బ్రాండ్ కాదు, బ్రాందీ షాపుల‌కు కు ప‌నికిరాద‌ని దుయ్య‌బ‌ట్టారు. మీరు అంటూ చాక‌చ‌క్యంగా `కోమ‌టిరెడ్డి` బ్రాండ్ చెబుతూ ప‌రోక్షంగా బ్ర‌ద‌ర్స్ ను టార్గెట్ చేశారు. అంతేకాదు, వెంక‌ట‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటార‌ని వివరించారు. కానీ, వెంక‌ట‌రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి చేసిన `కోమ‌టిరెడ్డి` బ్రాండ్ `మీరు` అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. గౌర‌వ‌వానికి భంగ‌క‌లిస్తూ మాట్లాడి రెచ్చ‌గొట్టద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని రేవంత్ రెడ్డిని మీడియా ముఖంగా డిమాండ్ చేశారు.

చండూరు స‌మావేశానికి వెళుతోన్న రేవంత్ రెడ్డి చాలా చాక‌చ‌క్యంగా వెంక‌ట‌రెడ్డి చేసిన డిమాండ్ కు స‌మాధానం చెబుతూనే రాజ‌గోపాల్ రెడ్డి స‌వాల్ కు ప్ర‌తి స‌వాల్ విసిరారు. `నేను మాట్లాడిన మాటల్లో వెంకటరెడ్డి గురించి మాట్లాడలేదు. ఆయన గౌరవాన్ని తగ్గించే విధంగా ఎప్పుడు మాట్లాడలేదు. నేను మాట్లాడిన మాటల్లో కేవలం రాజగోపాల్ రెడ్డి గురించి మాత్రమే మాట్లాడాను.` అంటూ ప‌రోక్షంగా వెంక‌ట‌రెడ్డికి వివ‌ర‌ణ ఇచ్చారు. అంతేకాదు, చిన్న వ్యాపారాలు చేసుకునే బ‌తికే రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అట్టుపెట్టుకుని వేల కోట్ల స్థాయికి ఎదిగాడ‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ లేక‌పోతే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బ్రాందీ షాపులో ప‌నిచేయ‌డానికి కూడా ప‌నికిరాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. గ‌త ఎనిమిదేళ్ల‌లో కేసీఆర్ మీద రాజ‌గోపాల్ రెడ్డి ఏ పోరాటం చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. త‌న‌పై 120 కేసులు రాష్ట్ర ప్ర‌భుత్వం పెట్టింద‌ని గుర్తు చేశారు. ఒక్క కేసు కూడా లేని రాజ‌గోపాల్ రెడ్డి ఆర్థిక ప్ర‌యోజ‌నాల కోసం బీజేపీకి వెళుతున్నాడ‌ని ఆరోపించారు.

రాజ‌కీయ ల‌బ్దికోసం రాజ‌గోపాల్ రెడ్డి త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని అన్నారు. రాజ‌కీయ కుల‌గురువు కేసీఆర్ మీద రాజ‌గోపాల్ రెడ్డి ప‌ల్లెత్తు మాట అనడానికి వెనుకాడ‌తార‌ని విమర్శించారు. ఇక కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డితో ఎలాంటి గ్యాప్ లేద‌ని రేవంత్ అన్నారు. సోనియా నాయ‌క‌త్వంలో ఆయ‌న కాంగ్రెస్ కు ప‌నిచేస్తార‌ని చెబుతూ మ‌నుగోడు ఉప ఎన్నిక‌ల్లోనూ ప్ర‌చారం చేస్తార‌ని వెల్ల‌డించారు. వాస్త‌వంగా రేవంత్ రెడ్డి ఆస్తుల‌పై రాజ‌గోపాల్ రెడ్డి రెండు రోజుల క్రితం ఆరోప‌ణ‌లు చేశారు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు చిల్ల‌రదొంగ‌, రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌రువాత బ్లాక్ మెయిల్ చేస్తూ బ‌తుకుతున్నాడ‌ని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో విలాస‌వంత‌మైన భ‌వ‌నం ఎలా వ‌చ్చిందో చెప్పాల‌ని నిల‌దీశారు. వాటికి బ‌దులు ఇవ్వ‌కుండా చాక‌చ‌క్యంగా రాజ‌గోపాల్ రెడ్డి కాంట్రాక్టుల‌పై చ‌ర్చ‌కు చండూరు చౌర‌స్తాకు వ‌స్తున్నానంటూ రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయ‌డం కొస‌మెరుపు.