టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న నేపధ్యంలో, ముందుగానే అప్రమత్తమైన పోలీసులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టిన రోజు సందర్భంగా, రేవంత్ రెడ్డి వెరైటీగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సరవెల్లి ఫోటోను, ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు రేవంత్ రెడ్డి. ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని పిలుపునివ్వడంతో రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు బ్యారికేడ్లు నిర్మించమే కాకుండా, పెద్దయెత్తున పోలీసు బలగాలను మొహరించారు. ఇక గత ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమీ లేదని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
