Site icon HashtagU Telugu

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్బంధం!

Revanth

Revanth

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ అనే ఆర్మీ అభ్యర్థి చనిపోయిన విషయం తెలిసిందే. శనివారం రాకేశ్ కుంటుంబాన్ని పరామర్శించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) బయలుదేరారు. అయితే ఘట్‌కేసర్‌లో రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ చీఫ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ప్రాంతం తన పరిధిలోకి వస్తుందనీ, తనను ఎలా అడ్డుకుంటారని పోలీసులను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ని అదుపులోకి తీసుకొని తరలిస్తున్న వాహనాన్ని ఘట్ కేసర్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.