TTD Plastic Ban: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక…బుధవారం నుంచి తిరుమలలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం!!

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు టీటీడీ మంగళవారం ఓ ముఖ్యమైన గమనికను విడుదల చేసింది.

  • Written By:
  • Updated On - May 31, 2022 / 11:11 PM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు టీటీడీ మంగళవారం ఓ ముఖ్యమైన గమనికను విడుదల చేసింది. రేపటి నుంచి అనగా…బుధవారం నుంచి తిరుమలపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించమని స్పష్టం చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిషేధం బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

తిరుమల కొండపై ప్లాస్టిక్ కు పూర్తిగా నిషేధిస్తున్నామని తెలిపిన టీటీడీ…కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించని విధంగా నిఘా పెడుతున్నట్లు పేర్కొంది. దీనికోసం అలిపిరి టోల్ గేట్ దగ్గర ప్లాస్టిక్ ను గుర్తించే సెన్సార్లతో నిఘా పెంచుతున్నట్లు తెలిపింది. అంతేకాదు కొండమీద వ్యాపారం చేస్తున్నవారు కూడా ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ సూచించింది.

టీటీడీ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ హోటళ్లు, దుకాణాల నిర్వాహకులు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా డస్ట్ బిన్లలో ఉంచాలని, తద్వారా సేకరణకు అనువుగా ఉంటుందని అన్నారు. దుకాణాల్లో అనుమతించిన వస్తువులనే విక్రయించాలన్నారు. దుకాణదారులు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు మాస్ క్లీనింగ్ చేపట్టాలని కోరారు. టీటీడీ విజిఓ శ్రీ బాలిరెడ్డి మాట్లాడుతూ జూన్ ఒకటో తేదీ నుంచి విజిలెన్స్, హెల్త్, ఎస్టేట్ అధికారులు నిరంతరంగా తనిఖీలు చేసి ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడ కనిపించినా దుకాణాలను సీజ్ చేస్తారని తెలిపారు.