Wrestlers Rejoin Work : తిరిగి జాబ్స్ లో చేరిన రెజ్లర్లు సాక్షి, వినేష్, పునియా

  • Written By:
  • Updated On - June 5, 2023 / 03:38 PM IST

భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ  బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా చాలా వారాలపాటు నిరసన తెలిపిన స్టార్ రెజ్లర్లు మళ్ళీ తమతమ జాబ్స్ లో చేరారు. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా రైల్వేలో తమ విధులను తిరిగి ప్రారంభించారు. ఈవిషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు.  ఈ ముగ్గురు మే 31న తమ పనిని మళ్ళీ  ప్రారంభించారు.  “తిరిగి జాబ్స్ లో చేరినంత మాత్రాన మేం న్యాయపోరాటం ఆపినట్టు కాదు.. న్యాయం జరిగేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. మేం కేసులు వెనక్కి తీసుకోలేదు. పోరాటం నుంచి వెనకడుగు వేయలేదు. దీనిపై దయచేసి మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దు” అని సాక్షి మాలిక్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

Also read : Nikhil Siddartha : అమిత్ షా పిలిచినా నేను వెళ్ళలేదు.. నాకు ఏ పార్టీ డబ్బులివ్వట్లేదు.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలు…

ఈ ముగ్గురు రెజ్లర్లు శనివారం సాయంత్రం కేంద్ర  హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఒక మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్ల పై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై నిష్పాక్షిక విచారణ చేయాలని కోరారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని అమిత్ షా రెజ్లర్లకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. “చట్టం దాని పని అది చేసుకుపోతుంది. న్యాయ ప్రక్రియతోనే ఈ అంశానికి పరిష్కారం లభిస్తుంది” అని రెజ్లర్లతో అమిత్ షా చెప్పినట్లు మీడియాలో న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయి.