Wuhan lab : వూహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా లీక్ కు ఆధారాల్లేవు

"కరోనా పుట్టినిల్లు చైనాలోని వూహాన్ ల్యాబ్ (Wuhan lab)" అని వాదిస్తూ వచ్చిన అమెరికా.. ఇప్పుడు మాట మార్చింది.

  • Written By:
  • Updated On - June 27, 2023 / 01:12 PM IST

“కరోనా పుట్టినిల్లు చైనాలోని వూహాన్ ల్యాబ్ (Wuhan lab)” అని వాదిస్తూ వచ్చిన అమెరికా.. ఇప్పుడు మాట మార్చింది. కరోనా వైరస్ మూలాలు వుహాన్‌ ల్యాబ్‌లో ఉన్నాయనడానికి ఎలాంటి ఆధారాల్లేవని అమెరికా నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఈవివరాలతో నాలుగు పేజీల రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. వూహాన్ ల్యాబ్ (Wuhan lab) లో వైరస్ పుట్టుకపై తగిన ఆధారాలు సేకరించలేకపోయామని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తేల్చి చెప్పింది. ఆ ల్యాబ్‌ నుంచి వైరస్ వచ్చిందన్నది ఊహే అయి ఉండొచ్చని తెలిపింది. వూహాన్‌ (Wuhan) ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో అన్ని విధాలుగా విచారణ జరిపినా ఎవిడెన్స్ లభించలేదని వివరించింది. అక్కడి సిబ్బందే వైరస్ తయారు చేసి లీక్ చేశారనడానికి రుజువులు లేవని వెల్లడించింది.

రకూన్ కుక్కల వల్లే కరోనా వ్యాప్తి ..

చైనాలోని వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌లో అక్రమంగా విక్రయిస్తున్న‌ రకూన్ జాతి కుక్కల నుంచి కరోనా వైరస్ వ్యాపించిందని అంతర్జాతీయ నిపుణుల బృందం ఆధారాలు కనుగొందని న్యూయార్క్ టైమ్స్ గతంలో ఓ న్యూస్ స్టోరీ పబ్లిష్ చేసింది. అంతర్జాతీయ వైరస్ నిపుణుల బృందం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2020 జనవరిలో జన్యు డేటాను సేకరించడానికి ముందే.. వూహాన్‌ సీఫుడ్ హోల్‌సేల్ మార్కెట్ దాని ప‌రిస‌ర ప్రాంతాల‌ను శుభ్రంచేశారు. చైనా అధికారులు మార్కెట్‌ను మూసివేసిన కొద్దిసేపటికే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం కొత్త వైరస్ వ్యాప్తికి సంబంధించిన అనుమానాలకు కార‌ణ‌మైంది. మార్కెట్ నుంచి జంతువులను తొలగించినప్పటికీ, శాస్త్ర‌జ్ఞులు గోడలు, మెటల్ బోనులు, బండ్ల నుంచి జ‌న్యు న‌మూనాల‌ను సేకరించారు. పరీక్షల అనంతరం శాంపిల్స్‌లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విశ్లేషణలో పాల్గొన్న ముగ్గురు శాస్త్రవేత్తలు సేక‌రించిన‌ జన్యు న‌మూనా జంతువులకు చెందినదని సూచించారు. అది స‌రిగ్గా రకూన్ జాతి కుక్క అవ‌శేషాల‌కు సరిపోయింద‌ని ది అట్లాంటిక్ మ్యాగ‌జైన్ ఒక న్యూస్ స్టోరీలో వెల్ల‌డించింది.

Also Read:  Singer Touches PM Modi Feet: ప్రధాని నరేంద్ర మోదీ పాదాలకు నమస్కరించిన అమెరికన్ సింగర్.. వీడియో వైరల్..!