పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులకు పూనకాలే వస్తాయి. అలాంటిది సంక్రాంతి పండుగకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ వచ్చి ఉంటే.. బాక్సాఫీసు దగ్గర జాతర మాములుగా ఉండేది కాదు. కానీ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది. దీంతో జనవరి 12న రిలీజ్ చేస్తానన్న ‘భీమ్లా నాయక్’ ను ఫిబ్రవరి 25 కి పోస్ట్ పోన్ చేశారు.
ఇప్పుడు కరోనా కారణంగా ఫిబ్రవరి 25 నుండి కూడా మరోసారి పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది పరిస్థితి. ఇక ‘భీమ్లా నాయక్’ తర్వాత పవన్ కళ్యాణ్ ఒకే టైం లో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు, హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీస్ ని చేయనున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా కి సంబంధించి కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ కాగా.. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలు కానుంది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘భవదీయుడు భగత్ సింగ్’ ని దర్శకుడు హారిష్ శంకర్ తెరకెక్కించబోతున్నారని…
ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డ్యూయెల్ రోల్ పోషించబోతున్నారని సమాచారం. పవన్ భగత్ సింగ్ రోల్ పవర్ గా ఉండబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. ‘భవదీయుడు భగత్ సింగ్’ లో పవన్ కళ్యాణ్ కి పవర్ ఫుల్ విలన్ గా కోలీవుడ్ టాప్ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్నాడని తెలుస్తోంది. విలన్ గా విజయ్ సేతుపతి పవన్ కి పర్ఫెక్ట్ అని, హరీష్ శంకర్ విజయ్ సేతుపతితో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన పవన్ పోస్టర్ సోషల్ మీడియాలో దుమ్ముదులిపిన సంగతి తెలిసిందే. బైక్ పైన పవర్ స్టార్ కూర్చున్న ఆ స్టిల్ ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది.