Site icon HashtagU Telugu

Today Top News: ఈరోజు ముఖ్యాంశాలు

Top Today News

Top Today News

Today Top News: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఉన్న జిల్లా జైలులో హెచ్ఐవీ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 63 మందికి హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. జైలులో హెచ్ఐవీ కేసులు పెరుగుతుండటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అబద్దపు హామీలు ఇవ్వడంతోనే తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి అధికారం ఇచ్చారన్నారు.

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 కేన్సర్ బారినపడ్డారు. దీంతో కుమారుడు ప్రిన్స్ హ్యారీ లండన్‌కు వెళ్లనున్నారు. మూడేళ్ల కిందట రాజకుటుంబం నుంచి విడిపోయిన హ్యారీ ప్రస్తుతం తన భార్య , ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు.

ఫిబ్రవరి 6న దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 150 తగ్గి 57,950కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాములపై 160 తగ్గుముఖం 63,220 ఉంది. కిలో వెండిపై 300 తగ్గడంతో 75,500 చేరింది.

రెండో టెస్టులో ఇంగ్లండ్​పై విజయం సాదించడంతో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. టెస్ట్ క్రికెట్​లో బజ్​బాల్​ ఫార్ములాను చిత్తు చేసిన తొలి ఆసియా కెప్టెన్​గా హిట్​మ్యాన్ అవతరించాడు.

ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత్ రైస్ ను ప్రారంభిస్తారు. 29 రూపాయలకే కేజీ బియ్యం రానుండడంతో వినియోగదారులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

సోనియాకు సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్. తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. నిన్న సోమవారం ప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. ఈ మేరకు ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయాలనీ సూచించారు.

అపోలో ఫౌండర్ సి.ప్రతాప్ రెడ్డి తన 91వ పుట్టిన రోజు సందర్భంగా ‘ది అపోలో స్టోరీ’అనే పుస్తకాన్ని లాంచ్ చేశారు ఉపాసన. ఈ సందర్భంగా తన తాతయ్య ప్రతాప్ రెడ్డి బయోపిక్ తీస్తానని చెప్పింది.

తిరుపతి పాకాలలో ఈతకెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

ఎన్నికల ప్రచారంలో చిన్నారులను ఉపయోగించవద్దని భారత ఎన్నికల సంగం రాజకీయ పార్టీలను హెచ్చరించింది.

టీఎస్‌ను టీజీగా మారుస్తున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వాహనాలకు అది వర్తిస్తుంది. సో ఎవరూ నంబర్‌ ప్లేట్లను టీజీగా మార్చుకోవద్దని రవాణాశాఖ అధికారులు కోరారు.

Also Read: Vastu Tips: ఇంట్లో ఫ్రిడ్జ్ పైన అలాంటి వస్తువులు పెడుతున్నారా.. అయితే జాగ్రత్త?