Site icon HashtagU Telugu

Tomatoes Costly: బాబోయ్…కిలో టామోటో రూ. 100 అంట..!!

Tomato

Tomato

టమాటో…కూరగాయల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. దాదాపు ప్రతి కూరలో టమాటోను ఉపయోగిస్తుంటారు. టమాటో లేదంటే ఓ చేయాలో అర్థం కాదు. కానీ అదే టమాటో రికార్డు స్థాయిలో ధర పెరిగితే ఎలా ఉంటుంది. నెల రోజుల క్రితం రైతు బజార్లలో టమాటో ధర రూ. 10కి దొరికితే నేడు అదే రైతు బజార్లలో రూ. 55కిలో అమ్ముతున్నారు. వారపు సంతల్లో అయితే రికార్డు స్థాయిలో రూ. 100కు విక్రయిస్తున్నారు. కూరగాయలు, పండ్లు అమ్మేందుకే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్లో అయితే కిలో టమాటో 125 రూపాయలని బోర్డ్ పెట్టి మరీ అమ్ముతున్నారు.

హైదరాబాద్ నగరంలో విక్రయించే టమోటోలు ఎక్కువగా చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి దిగుమతి అవుతుంటాయి. అయితే ఈ ఏడాది శ్రీలంక సంక్షోభంతో ఎక్కువగా టమాటోలు అక్కడకు ఎగుమతి అవుతున్నాయి. రోజు 50 ట్రక్కుల వరకు తీరప్రాంతానికి చేరుకుని శ్రీలంకకు ఎగుమతి అవుతున్నాయి. 25కేజీలున్న టమాటో ట్రే రూ. 1300 నుంచి 1400 వరకు పంట పొలం దగ్గరే విక్రయిస్తున్నారు. దీంతో అక్కడి రైతులు మరో ప్రాంతంపై ఇంట్రెస్ట్ చూపించడంలేదు. మరోవైపు టమోటోపాటు ఇతర కూరగాలయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో బీన్స్, 159,బీరకాయ 120, బెండ 120, పలుకుతున్నాయి.