Tomatoes Hike:కొండెక్కుతున్న టమాటా ధరలు…కిలో ఎంతంటే..!!

టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కొండెక్కుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Tomato Prices

Tomato Prices

టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కొండెక్కుతున్నాయి. పలు వ్యవసాయ మార్కెట్లో భారీగా ధరలు పలుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో ప్రస్తుతం టమాటా ధర గరిష్టంగా కిలో రూ. 88వరకు పలుకుతోంది. రెండు నెలల క్రితం టమాటాకు ధరలు లేక నేలపై పోశారు. వారం రోజులుగా వాటి ధరలు భారీగా పెరుగుతన్నాయి.

అయితే టమాటా దిగుబడులు తగ్గడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మార్కెట్ కు టమాటాలు తక్కువగా వస్తున్నాయని..శుక్రవారం రైతులు 155టన్నుల టమాటాలు మాత్రమే తీసుకొచ్చారని వ్యాపారులు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకే కాకుండా…దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు కూడా టమాటాలు ఎగుమతి అవుతుంటాయి. దీంతో ఇతర ప్రాంతాల్లో కూడా టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

  Last Updated: 21 May 2022, 12:23 PM IST