Tomato: రూ. 21 లక్షలు విలువైన టమోటా లారీ మాయం.. అసలేం జరిగిందంటే?

టమాటా.. ఈ పేరు వింటే చాలు దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలు భయంతో వణికి పోతున్నారు. దానికి గల కారణం టమాటా రేటు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంత

  • Written By:
  • Updated On - July 31, 2023 / 06:07 PM IST

టమాటా.. ఈ పేరు వింటే చాలు దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలు భయంతో వణికి పోతున్నారు. దానికి గల కారణం టమాటా రేటు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో టమాటా ఏకంగా డబుల్ సెంచరీ కొట్టింది. దీంతో కొన్ని ప్రాంతాలలో టమాటాలు కొనడానికి ప్రజలు భయపడిపోతున్నారు. మరోవైపు టమాటా ధరల పెరుగుదల వాటిని పండించే రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో టమాటా దొంగతనాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. అంతేకాకుండా టమాటాల కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు.

తాజాగా ఏకంగా రూ.21 లక్షల విలువైన 11 టన్నుల టమాటా లోడుతో బయలుదేరిన లారీ కనిపించకుండా పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ లోని భఫాల్‌లో చోటుచేసుకుంది. దీంతో ఈ ఘటన కాస్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే. కర్ణాటక లోని కోలార్‌లో ఉన్న ఎస్‌వీటీ ట్రేడర్స్ యజమాని మునిరెడ్డి దుకాణం నుంచి 11 టన్నుల టమాటా లోడుతో లారీ రాజస్థాన్‌ లోని జైపుర్‌ కు గురువారం బయల్దేరింది. అయితే శనివారం రాత్రి లారీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ టోల్‌ గేట్‌ దాటినట్లు మునిరెడ్డికి డ్రైవర్‌ సమాచారం అందించాడు. ఆదివారం ఉదయం లారీ ఎంత దూరం వెళ్లిందనే సమాచారం తెలుసుకునేందుకు మునిరెడ్డి డ్రైవర్‌కు ఫోన్ చేయగా నంబర్‌ అందుబాటులో లేదని వచ్చింది.

లారీకి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ లోకేషన్‌ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళనతో కోలార్‌ పోలీసులను ఆశ్రయించాడు. మునిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. లారీ ప్రమాదానికి గురైందా? లేక మొబైల్‌ నెట్‌వర్క్ సమస్య వల్ల డ్రైవర్‌ ఫోన్‌ కలవడం లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆ లారీ కి సంబంధించిన ఎటువంటి సమాచారం తెలియడం లేదు. దీంతో పోలీసులు ఆ లారీని ఛేదించే పనిలో పడ్డారు. అయితే సదరులు లారీ డ్రైవర్ ని కొట్టి అలారిని వేరే వాళ్ళు ఎత్తుకెళ్లారా, లేదంటే ఆ లారీ డ్రైవర్ ఎత్తుకుపోయాడా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఈపాటికి వార్తల్లో వచ్చి ఉండేది. కానీ అవి ఏమి జరగకపోవడంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి