Site icon HashtagU Telugu

Tomato Prices: జూలై చివరినాటికి తగ్గనున్న టమోటా ధరలు

Tomato Prices

Tomato Rs100

Tomato Prices: గత వారం రోజులుగా టమోటా ధరలు మండిపోతున్నాయి. అకాల వర్షాలు, పంటలకు భారీ నష్టం వాటిల్లడంతో ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో టమోటా ధరలు సెంచరీ కొట్టాయి. కొన్ని ప్రాంతాల్లో 120 చేరుకుంది. అయితే జూలై చివరినాటికి టమోటా ధరలు కాస్త తగ్గనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ సీనియర్ అధికారి తెలిపారు. రంగా రెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్ మరియు తెలంగాణలోని ఇతర జిల్లాల నుండి నగర మార్కెట్‌లకు టమోటా సరఫరా అవుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్ర నుండి ఇతర రకాలు కూడా తెలంగాణకు దిగుమతి అవుతుంది.

టమోటా పంట చేతికి రావడానికి 60 రోజుల నుండి 100 రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అయితే ప్రస్తుతం టమోటా మార్కెట్లోకి రావడానికి ఆలస్యానికి కారణం రుతుపవనాల ఆలస్యం. వర్షాలు ఆలస్యంగా కురవడంతో రైతులు జూన్ మొదటివారంలో కాకుండా జూన్ చివరిలో నాట్లు వేయడం జరిగింది. ఈ క్రమంలో టమోటా ధరలు భారీగా పెరిగాయి. నిల్వలు లేకపోవడంతో ఉన్న నిల్వలకు భారీగా డిమాండ్ పెరిగింది.

Read More PCB New Chairman: పాక్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్‌గా జాకా అష్రఫ్