Tomato: టమాటాకు పెరుగుతున్న రక్షణ.. పొలాల్లో ఏకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు?

రోజు రోజుకి దేశవ్యాప్తంగా టమాటా ధరలు అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో కొన్ని రాష్ట్రాలలో కిలో టమాటా ధరలు రూ. 100 పైగా ఉండగ

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 03:15 PM IST

రోజు రోజుకి దేశవ్యాప్తంగా టమాటా ధరలు అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో కొన్ని రాష్ట్రాలలో కిలో టమాటా ధరలు రూ. 100 పైగా ఉండగా మరికొన్ని ప్రదేశాలలో రూ.200 వరకు కూడా పలుకుతుంది. దీంతో సామాన్య ప్రజలు టమోటాలు కొనుగోలు చేయాలి అంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టమాటాల కోసం కొందరు దుర్మార్గులు ఎంతటి దారుణానికైనా ఒడి గడుతున్నారు. ఇప్పటికే టమోటాల కోసం కొంతమందిని చంపినం ఘటనలు కూడా విలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో టమాటాలకు రక్షణ పెరిగిపోతోంది.

ముఖ్యంగా టమాటా పంటలు ఉన్న రైతులు గుప్పు గుప్పు మంటూ బ్రతకాల్సిన పరిస్థితులను నెలకొంటున్నాయి. రేట్లు పెరిగాయి అని టమాటా రైతులు సంతోషించే లోపే టమాటాల కోసం దాడులకు కూడా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు రైతులు కొత్తగా ఆలోచించి పొలం చుట్టూ టమాటాల కోసం సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. టమాటా విలువైన పంట కావడంతో ఒక రైతు కొంచెం ఆధునికంగా ఆలోచించాడు.

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ కు చెందిన శరద్ రావత్ తన పొలంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. వాటి సాయంతో నిఘా పెట్టి పంటను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. టమాటా ధరలు భారీగా పెరిగిపోయిన రోజుల్లో టమాటా ట్రక్కులను చోరీ చేయడం కూడా వెలుగు చూసింది. అలాంటి రిస్క్ ఉండకూడదనే ఈ రైతు ఇలాంటి ఆలోచన చేశాడు. తన పొలంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రూ.22 వేలు ఖర్చయినట్టు అతను తెలిపాడు. పంటను కాపాడుకునేందుకు ఇలా చేయడం మంచిదే అని అంటున్నాడు సదరు రైతు.