Site icon HashtagU Telugu

Tomato Prices: టమాట.. తినేటట్టు లేదు!

Tomoto

Tomoto

కూరగాయల ధరల మంటకు సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. హైదరాబాద్, విజయవాడలో కిలో టమాటా ధర రూ.70 దాటగా, కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.80కి చేరింది. రెండు నెలల క్రితం ఈ నగరాల్లో కేజీ టమాటా 10 నుంచి 20 రూపాయలు మాత్రమే. ఇంకొన్ని రోజుల్లో ధర వందకు చేరినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. ఏ కూర వండినా అందులో టమాటా ఉండాల్సిందే. అలాంటి టమాటా ఇప్పుడు కొనాలంటేనే కరువైపోయింది. తుఫాన్‌ కారణంగా టమాట పంట కు బాగా నష్టం వాటిల్లింది. ఫలితంగా ఈసారి దిగుబడి తగ్గింది. ఈ కారణంగా టమాట రేట్లు రెక్కలు తొడిగాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధానమైన కర్నూలు, చిత్తూరు, మదనపల్లి మార్కెట్లోనూ టమాటా ధర భారీగా పెరిగిపోయింది. టమాటా మాత్రమే కాదు.. క్యాప్సికమ్, చిక్కుడు లాంటి కూరగాయలు కూడా కేజీ రూ.80 దగ్గర ఉన్నాయి

Exit mobile version