Tomato Prices Rise: కిలో 80 రూపాయ‌ల‌కు చేరిన ట‌మాటాలు..!

బంగాళదుంపలు, ఉల్లిపాయల తర్వాత వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే టమాటా ధరలు (Tomato Prices Rise) గత కొద్ది రోజులుగా విపరీతంగా పెరిగాయి.

  • Written By:
  • Updated On - July 5, 2024 / 11:49 AM IST

Tomato Prices Rise: ఒకవైపు రుతుపవనాలతో పాటు దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుండగా.. మరోవైపు ప్రజల జేబులపై భారం పెరుగుతుందనే భయం నెలకొంది. ముఖ్యంగా వంటగది విషయంలో ప్రజల ఖర్చులు పెరగనున్నాయి. బంగాళదుంపలు, ఉల్లిపాయల తర్వాత వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే టమాటా ధరలు (Tomato Prices Rise) గత కొద్ది రోజులుగా విపరీతంగా పెరిగాయి.

ET నివేదిక ప్రకారం.. గత కొన్ని రోజులుగా టమోటా రిటైల్ ధరలు వేగంగా పెరిగాయి. ఇప్పుడు కిలో రూ. 80కి చేరుకున్నాయి. నివేదికలో తెలిపిన ప‌కారం.. వర్షం కారణంగా టమోటాల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా కొన్ని రిటైల్ మార్కెట్లలో టమోటాలు కిలో రూ. 80 ధరకు విక్రయిస్తున్నారు.

ప్రభుత్వ డేటాలో టమోటా ధరలిలా..!

అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం టమాటా ధరలు అంతగా పెరగలేదు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం,.. మాటా రోజువారీ సగటు రిటైల్ ధరలు జూలై 3న కిలోకు రూ.55గా ఉన్నాయి. ఒక నెల క్రితం కిలో రూ.35గా ఉంది.

ఈ కారణంగా టమోటా ధరలు పెరిగాయి

ఒక్కసారిగా టమాటా ధరలు పెరగడానికి భారీ వర్షాలే కారణమంటున్నారు. రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో పలు రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్ నెట్‌వర్క్ సరిగా లేకపోవడంతో హిమాచల్ ప్రదేశ్ నుంచి పలు రిటైల్ మార్కెట్‌లకు టమాటా సరఫరా నిలిచిపోవడంతో ధరలు పెరుగుతున్నాయి.

Also Read: Government Employees : కాంగ్రెస్ సర్కార్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు అంత చులకనా..?

వాతావరణ శాఖ అంచనాలు సరిగ్గా లేవు

హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలో టొమాటో ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలలో ఒకటి. హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కొండ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, ఇది రహదారి నెట్‌వర్క్.. ట్రాఫిక్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా తెలిపింది. అదే సమయంలో భారీ వర్షాల కారణంగా టమోటా పంట కూడా దెబ్బ‌తింది. అంటే రానున్న రోజుల్లో టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

We’re now on WhatsApp : Click to Join

గతేడాది ధర బాగా పెరిగింది

సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో టమాటా ధరలు పెరుగుతాయి. గతేడాది పరిస్థితి మరీ దారుణంగా మారి కిలో టమాట ధర రూ.350కి చేరింది. ఆ తరువాత ప్రభుత్వం సహకార సంస్థల సహాయంతో అనేక నగరాల్లో రాయితీ ధరలకు టమోటాలను విక్రయించడం ప్రారంభించింది.