టమాటా (Tomato ) రైతులు నిత్యం మార్కెట్ పెరుగుదల, పతనాలతో సతమతమవుతుంటారు. ఒక వేళ టమాటా ధరలు ఆకాశాన్నంటితే, మరో వేళ నేల చూపులు చూస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా ధరలు (Tomato Price) కేజీ రూ.10 నుంచి రూ.20 మధ్య పలుకుతున్నా, రైతులకు మాత్రం కేవలం రూ.2,3 ,4 మాత్రమే అందుతోంది. పెట్టుబడులకు, కూలీ ఖర్చులకు కూడా సరిపోని ఈ ధరలతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మార్కెట్‌లో సరఫరా పెరగడం, మధ్యవర్తుల అధిక లాభాల కారణంగా రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదు.
Kodali Nani Health Update : కొడాలి నానికి సర్జరీ తప్పనిసరి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గంగన్నగూడెంకు చెందిన నర్సింహులు అనే రైతు నాలుగు ఎకరాల్లో టమాటా సాగు చేసి మార్కెట్‌కు వెళ్లినప్పుడు తీవ్ర నిరాశ చెందాడు. 56 పెట్టెల టమాటాలను విక్రయించేందుకు మహబూబ్‌నగర్ రైతు బజార్‌కు తీసుకెళ్లిన అతనికి, ఒక్కో పెట్టెకు రూ.100 కంటే ఎక్కువ ధర ఇవ్వలేకపోయారు. దీంతో అతను 39 పెట్టెలను కేవలం రూ.3,500కు అమ్ముకున్నాడు. మిగిలిన 17 పెట్టెలను కొనేవారు లేకపోవడంతో వాటిని అడవిలో పారేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి కూడా రావడం లేదని, కూలీలకు డబ్బులు కూడా కష్టమవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
Pig Liver : తొలిసారిగా మనిషికి పంది కాలేయం.. ఎందుకు ?
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే వ్యవస్థను మెరుగుపరచాలి అని కోరుతున్నారు. ప్రధానంగా రైతు బజార్లను మెట్రో స్టేషన్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు నేరుగా వినియోగదారులకు అమ్ముకునే అవకాశం కల్పించాలి. మధ్యవర్తుల పాత్రను తగ్గించి పారదర్శక ధర విధానం అమలు చేయాలి. పొరుగు దేశాలకు టమాటా ఎగుమతులను ప్రోత్సహించి, మార్కెట్‌లో సరైన ధరను అందించేందుకు చర్యలు తీసుకోవాలి. అలాగే టమాటా ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లను పెంచడం వల్ల రైతులు ఎక్కువ దిగుబడి వచ్చినప్పటికీ నష్టపోకుండా ఉండేలా చూడొచ్చు అని అభిప్రాయపడుతున్నారు.