Site icon HashtagU Telugu

Tomato Price Crashes : రూ.300 నుండి రూ.30 పైసలకు పడిపోయిన టమాట ధర..

Tomato Price Crashes

Tomato Price Crashes

మొన్నటి వరకు సామాన్య ప్రజలను కన్నీరు పెట్టించిన టమాట (Tomato)..ఇప్పుడు రైతులను కన్నీరు (Tomato Farmer Crying) పెట్టిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది టమాట ధర ఆకాశానికి తాకినా సంగతి తెలిసిందే. దాదాపు రెండు , మూడు నెలల వరకు కేజీ టమాట ధర రూ. 250 నుండి 300 ల వరకు పలికింది. ఈ టమాట ధర చూసి సామాన్య ప్రజలు గగ్గోలు పెట్టారు. టమాట కొనడమే కాదు వాటి వైపు చూసేందుకు కూడా భయపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా సబ్సిడీ రూపంలో టమాట ను అందించారు. ఈ మూడు నెలల్లో టమాట పండించిన రైతులు కోటీశ్వరులు అయ్యారు.

ఇదంతా కూడా మొన్నటి వరకు..ప్రస్తుతం టమాట ధర దారుణంగా పడిపోయింది. రూ. 300 పలికిన టమాట..ఇప్పుడు రూ. 30 పైసలు (Rs 30 paise Per Kg) పలుకుతుంది. అది కూడా కష్టం మీద. తాజాగా నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్‌ (Agriculture Market Committee Peapully
)లో ధరలు లేకపోవడంతో రైతులు తాము తీసుకొచ్చిన టమాటాలను అక్కడే పారబోసి వెళ్లిపోయారు. దీంతో వాటిని పశువులు మేస్తూ కనిపించాయి. ప్యాపిలి మార్కెట్‌లో కిలో టమాటా రూ.3 పలికితే.. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌ (Pattikonda Market)లో దారుణంగా 25 కిలోల టమాటా బాక్సు రూ.10 నుంచి రూ.35 వరకూ పలుకుతుండటం గమనార్హం. అంటే కేజీ టమాటా దాదాపు 30 నుంచి 40 పైసలే. దీంతో గిట్టుబాటు ధరలు లేక రోడ్లపై టమాటాలను రైతులు పారబోస్తున్నారు. పంట కోత, రవాణా ఖర్చులు సైతం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Chandrababu Scam: చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ మంత్రులు

రెండు నెలల క్రితం వరకు కొండెక్కిన టమాటా..ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేక పారబోసే స్థాయికి చేరుకుంది. మార్కెట్‌లోకి భారీగా టమాట పోటెత్తుతుండగా.. ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు రాక టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నెల కిందటి వరకూ క్వింటాళ్ల కొద్దీ టమాటాలు తీసుకొచ్చి.. సంచులతో డబ్బులు తీసుకెళ్లారు. కానీ, ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.