Site icon HashtagU Telugu

Tomato Price: నెల రోజుల్లో టమాటాలు అమ్మి 3 కోట్ల సంపాదన

Tomato Price

New Web Story Copy 2023 07 20t214739.740

Tomato Price: దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. వర్షాకాలం కావడంతో, నిల్వలు లేని కారణంగా టమాటా ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దేశంలో కొన్ని ప్రాంతంలో టమాటా 150 రూపాయల వరకు పలుకుతుంది. కేంద్ర ప్రభుత్వం ధరలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ నిల్వలు లేని కారణంగా కొందరు దళారులు అధిక ధరకు అమ్ముతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న దృష్ట్యా టమాటా రైతులు కొందరు భారీగా లాభాలు గడించారు. లక్షల్లో సంపాదించారు.

మహారాష్ట్ర – పూణేకి చెందిన ఈశ్వర్ గాయ్‌కర్ అనే రైతు 12 ఎకరాల్లో మూడేళ్లుగా టమాటాలు పండించి తీవ్రంగా నష్టపోయారు. అయితే ప్రస్తుతం టమాటా ధరలు భారీగా పెరగడంతో గత నెల రోజుల్లో ఏకంగా 3,60,000 కిలోల టమాటాలు అమ్మి 3 కోట్ల రూపాయలు ఆర్జించాడు. తన వద్ద ఇంకా 80 వేల కిలోల టమాటా నిల్వ ఉందని, దాని మొత్తం 50 లక్షలు పలుకుతుందని చెప్తున్నాడు ఈశ్వర్ గాయ్‌కర్. 40 లక్షలు పెట్టుబడితో పండించిన పంటకు భారీ మొత్తంలో లాభాలు రావడంతో ఆ రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తన కష్టానికి ఫలితం దక్కిందని చెప్తున్నాడు. ఈశ్వరుడు దయవల్లనే ఇలా జరిగిందని సంతోషం వ్యక్తం చేశాడు. తన కష్టాలు తీర్చిన ఆ పరమేశ్వరుడి గుడి కట్టించి ప్రతిరోజు పేదవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పాడు.

Also Read: Telangana: మెట్రో, ఆర్‌టీసీ బస్సులకు ఉమ్మడి ట్రావెల్‌ కార్డు