Site icon HashtagU Telugu

Tollywood Strike: సినీ కార్మికుల నిరవధిక సమ్మె!

Tollywood

Tollywood

మెరుగైన వేతనాలు కోరుతూ 20 వేల మందికి పైగా తెలుగు సినీ కార్మికులు బుధవారం నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించారు. వేతనాల పెంపునకు డిమాండ్ చేస్తూ 24 సినిమాలకు చెందిన కార్మిక సంఘాలు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వద్ద నిరసనకు దిగారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మధ్య సమన్వయం కొరవడిందని కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమ్మెకు దిగాలని నిర్ణయించారు.

ఈ సమ్మె ప్రభావం చిరంజీవి వాల్తేరు వీరయ్య, భోళా శంకర్, ప్రభాస్ సాలార్, చరణ్ RC 15 సహా నిర్మాణంలో ఉన్న అనేక చిత్రాలపై ఎఫెక్ట్ పడనుంది. “మెరుగైన వేతనాలు అడిగే హక్కు మాకు ఉంది. సగటున, ఒక సినిమా కార్మికుడు రోజుకు `500-`1,500 మధ్య పొందుతాడు. మా నిర్ణయం అన్ని సినిమా షూట్‌లను ప్రభావితం చేస్తుందని మాకు తెలుసు. కానీ మేము మా హక్కుల కోసం పోరాడకపోతే, ఇంకెవరు చేస్తారు? ఒక సీనియర్ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నిర్మాతలు కూడా సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు. “కొంతమంది నిర్మాతలు పదే పదే రిక్వెస్ట్ చేసినా బకాయిలు క్లియర్ చేయడం లేదు. చెల్లింపులలో పారదర్శకతను కోరుకుంటున్నాము. షూటింగ్ పూర్తయిన వెంటనే మాకు చెల్లించమని రిక్వెస్ట్ చేస్తున్నాం” అని అన్నారాయన.