Site icon HashtagU Telugu

Tollywood Actor: ప్రముఖ నటుడు మన్నవ బాలయ్య మృతి

Balaiah

Balaiah

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత మన్నవ బాలయ్య ఏప్రిల్ 9వ తేదీన హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలోని తన నివాసంలో 94 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగానే ఆయన మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి, యమలీల, మల్లేశ్వరుడు, శ్రీరామరాజ్యం, మిత్రుడు, పెళ్లి సందడి, బొబ్బిలి యుద్ధం, పాండవ వనవాసం, పల్నాటి యుద్ధం, పార్వతీ కళ్యాణం తదితర చిత్రాల్లో ప్రధాన సహాయ పాత్రలు పోషించిన బాలయ్య 2012లో రఘుపతి వెంకయ్య అవార్డుతో పాటు నంది అవార్డులను అందుకున్నారు. చిరంజీవి ఊరుకిచ్చిన మాట (రచయిత), చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాత విభాగంలో నంది. ఆయన గుంటూరు జిల్లాలోని చావపాడు గ్రామంలో ఏప్రిల్ 9, 1930లో జన్మించారు. సినీ ప్రముఖులు, ఆయన అనుచరులు  సంతాపం తెలియజేస్తున్నారు.