Site icon HashtagU Telugu

Mahesh Babu Shirtless: చొక్కా లేకుండా మహేశ్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Mahesh

Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తన మ్యాన్లీ లుక్‌తో ఆశ్చర్యపరిచాడు. ఆ లుక్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన తదుపరిది అని చాలా మంది ఆశ్చర్యపోయారు. శనివారం స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న మహేష్ బాబు కు చెందిన ఫొటోలను పోస్ట్ చేసింది నమ్రత శిరోద్కర్. చొక్కా లేకుండా మహేష్ బాబు స్విమ్మింగ్ క్యాప్, గాగుల్స్ ధరించి కనిపించాడు. చాలా ఫిట్‌గా, అద్భుతంగా కనిపిస్తున్నాడు. “శనివారం ఉదయాలు ఇలాగే ఉంటాయి. #toocoolforthepool” అని నమ్రత క్యాప్షన్ ఇచ్చింది.

మహేశ్ ఇప్పటివరకు ఏ సినిమాలోకూడా తన బాడీ చూపలేదు. కానీ మొదటిసారి చొక్కా లేకుండా కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. త్రివిక్రమ్ తో SSMB28 సినిమా కోసం మహేష్ బాబు తన పాత్రకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతున్నాడు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్ రాధాకృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే నెల ప్రారంభం కానుంది. మేకర్స్ ప్రకటించినట్లుగా SSMB28 ఏప్రిల్ 28, 2023న తెరపైకి రానుంది.

Exit mobile version