Allu Arjun @New York: న్యూయార్క్ లో అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం!

న్యూయార్క్‌లో జరిగే వార్షిక ‘ఇండియా డే పరేడ్‌’లో గ్రాండ్ మార్షల్‌గా దేశం తరపున నాయత్వం వహించాడు అల్లు అర్జున్.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun

Allu Arjun

న్యూయార్క్‌లో జరిగే వార్షిక ‘ఇండియా డే పరేడ్‌’లో గ్రాండ్ మార్షల్‌గా దేశం తరపున నాయత్వం వహించాడు అల్లు అర్జున్. భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ కు ఈ గౌరవం దక్కింది. న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ పాల్గొన్నారు. అల్లు అర్జున్ ఇండియాలోని పెద్ద నటుల్లో ఒకరు. ఆయన చిత్రం పుష్ప: ది రైజ్ – పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లు సంపాదించింది హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇటీవలనే అల్లు అర్జున్ న్యూయార్క్‌లో ఉన్నారు.

USలోని భారతీయ ప్రవాసులు నిర్వహించిన ఇండియా డే పరేడ్‌లో భారతదేశానికి నాయకత్వం వహించిన సందర్భంలో న్యూయార్క్‌లో జరిగిన ఈవెంట్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు బన్నీ. “న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో పాల్గొనడం గౌరవంగా ఉంది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు బన్నీ. తెలుపు రంగు దుస్తులను అల్లు అర్జున్ ధరించగా, స్నేహ పసుపు దుస్తులు ధరించి, ఓపెన్ టాప్ వాహనంపై అలరించారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి సతీసమేతంగా భారతదేశ జెండాను ప్రదర్శించారు. అల్లు అర్జున్ చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.

  Last Updated: 22 Aug 2022, 03:02 PM IST