Mahesh Birthday Special: పేద పిల్లల గుండె చప్పుడు.. ఈ శ్రీమంతుడు!

మహేశ్... ఆ పేరులో ఓ వెబ్రేషన్.. అందుకే అమ్మాయిలకు కలల రాకుమారుడయ్యాడు.

Published By: HashtagU Telugu Desk
Mahesh1

Mahesh1

మహేశ్… ఆ పేరులో ఓ వెబ్రేషన్.. అందుకే అమ్మాయిలకు కలల రాకుమారుడయ్యాడు. బాక్సాఫీస్ రికార్డులు తిరుగరాస్తూ అభిమానులకు శ్రీమంతుడయ్యాడు… నిర్మాతలకు అక్షయ పాత్రుడై, డైరెక్టర్లకు మనసున్న మహర్షి లాంటివాడయ్యాడు. ఒకసారి కమిట్ అయితే బ్లైండ్ గా దూసుకుపోయే అరుదైన వ్యక్తిత్వం సొంతం చేసుకున్నవాడు. ఇవన్నీ మహేశ్ కు ఒకవైపు అయితే.. పేద పిల్లలకు గుండె ఆపరేషన్లకు చేతనైన సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు మరోవైపు. ఇవాల ప్రిన్స్ మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేస్తున్న సోషల్ సర్వీస్  పరిచయం మీకోసం..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలని నమ్ముతారు. ముఖ్యంగా మహేష్ వార్షిక సంపాదనలో 30% స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఖర్చుచేస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పేద పిల్లల చికిత్సకు మద్దతుగా ‘హీల్ ఎ చైల్డ్’ వంటి NGOలకు  అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. తన తనయుడు గౌతమ్ పుట్టిననప్పుడు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ క్షణం నుంచే పేద పిల్లలకు చైతనైన సాయం చేయాలనుకున్నాడు. ఆంధ్రా హాస్పిటల్‌కు చెందిన వైద్యులు పిల్లలకు ఒకేసారి 100కుపైగా గుండె శస్త్రచికిత్సలు చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. శ్రీమంతుడు సినిమా తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు గ్రామాలను దత్తత తీసుకుని ఆయా ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నాడు సూపర్ స్టార్. దత్తత తీసుకున్న గ్రామాల్లో వైద్య సహాయం, స్థానికుల కోసం చేసే ఆపరేషన్ల కోసం తనవంతుగా ఖర్చు చేస్తున్నాడు.

ఒకే సమయంలో అన్ని వంద ఆపరేషన్లు చేయడానికి ఆర్థిక సహాయం అందించి తాను సమాజాకినికి ఎంతో అవసరమో చెప్పకనే చెప్పాడు. స్టార్ హీరో భార్య నమత్ర దత్తత తీసుకున్న గ్రామాలలో చేయవలసిన అన్ని కార్యక్రమాలను వ్యక్తిగతంగా చూసుకుంటుంది. భవిష్యత్తులో నిర్వహించాల్సిన పనులను ప్లాన్ చేయడానికి గ్రామాలను సందర్శిస్తూ ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు మౌనంగా సహాయం చేసినందుకు మహేష్ బాబును అభినందించాలి. యువత ఖచ్చితంగా అతన్ని రోల్ మోడల్‌గా తీసుకోవాల్సి అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో గుండె సమస్యలతో బాధపడే పిల్లలు MB Foundation ను సంప్రదిస్తే వెంటనే స్పందిస్తూ తన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఇవాళ మహేశ్ పుట్టినరోజు సందర్భంగా పోకిరి మరోసారి రీరిలీజ్ అయ్యింది. వాటి ద్వారా వచ్చే డబ్బులు కూడా సేవా కార్యక్రమాలు ఖర్చు చేయనున్నట్టు ఆయన భార్య ఇప్పటికే అభిమానులకు స్పష్టం చేసింది.

  Last Updated: 09 Aug 2022, 12:08 PM IST