Site icon HashtagU Telugu

Nithin meets Nadda: నితిన్ తో నడ్డా భేటీ!

Nadda

Nadda

బీజేపీ తెలంగాణే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ కు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే సినిమా స్టార్స్ తో  బీజేపీ నేతలు భేటీ అవుతుండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైద‌రాబాద్‌లోని నోవాటెల్ (Novatel) హోట‌ల్‌లో బ‌స చేశారు. జేపీ న‌డ్డా పలువురు ప్ర‌ముఖుల‌తో భేటీ అయ్యారు. శ‌నివారం ఉద‌యం ప్ర‌ముఖ మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీ రాజ్‌ను క‌లిశారు. సాయంత్రం నితిన్ వ‌చ్చి భేటీ అయ్యారు.

‘‘తెలంగాణలో ఈరోజు ప్రముఖ తెలుగు నటుడు @actor_nithiin కలవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాం. నితిన్ తన రాబోయే సినిమాల గురించి కూడా చెప్పాడు. అతనికి శుభాభినందనలు తెలియజేశాను’’ అంటూ జేపీ నడ్డా ట్వీట్ చేశారు. కాగా ఈ భేటీలో నితిన్‌తో పాటు బీజేపీ ఎం.పి ల‌క్ష్మ‌ణ్‌, రామ‌చంద్ర‌రావు ఉన్నారు. బీజేపీ అధ్య‌క్షుడు ..నితిన్‌ను క‌ల‌వ‌టం హాట్ టాపిక్‌గా మారింది.