తిరుమలలో సినీ ప్రముఖులు సందడి చేశారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమలలు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సినీనటుడు అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు స్వామి వారిని దర్శించుకో లేక పోయమని, ఇవాళ స్వామి వారి ఆశీస్సులు పొందాంమని, అలాగే ఈ ఏడాది ప్రపంచ ప్రజలందరికి అందరికి మంచి జరగాలని ప్రార్ధించినట్లు అక్కినేని నాగార్జున చెప్పారు.
King Nag: శ్రీవారి సేవలో ‘బంగార్రాజు’ ఫ్యామిలీ

Nag