Site icon HashtagU Telugu

Tollywood : జ‌గ‌న్‌తో భేటీ అయిన సినీ పెద్ద‌లు.. తార‌క్ డుమ్మా, నాగ్ డ్రాప్

Cm Jagan Tollywood

Cm Jagan Tollywood

టాలీవుడ్ సినిమా టికెట్ల రేట్లు, ఏపీలో పరిశ్రమ అభివృద్ధిపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో చ‌ర్చించేందుకు టాలీవుడ్ ప్ర‌ముఖులు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఈ క్ర‌మంలో చిరంజీవితోపాటు మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, పోసాని, కొరటాల శివ, నటుడు అలీ, నారాయణ మూర్తి త‌దిత‌రులు సీయం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. పరిశ్రమకు సంబంధించి 17 అంశాలను సినీపెద్దలు, ముఖ్య‌మంత్రి జగన్‌ ముందు పెట్టనున్నట్లు స‌మాచారం. ఇప్పటికే ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన క‌మిటీ, టికెట్ రేట్లపై పలు ప్రతిపాదనలు సిద్దం చేసింది.

ఇక ఈ స‌మావేశానికి టాలీవుడ్ స్టార్ హీరోలు అక్కినేని నాగార్జున‌, జూన‌య‌ర్ ఎన్టీఆర్‌లు డుమ్మా కొట్టార‌ని తెలుస్తోంది. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడైన నాగార్జున ఈ భేటీకి హాజరవుతారని అందరూ భావించారు. సీఎం జ‌గ‌న్‌తో భేటీ కోసం సీఎంవోకు ఇచ్చిన లిస్ట్‌లో కూడా నాగార్జున‌, తార‌క్‌ల పేర్లు ఉన్నాయి. అయితే ఈ ఇద్ద‌రు హీరోలు జ‌గ‌న్‌తో జ‌రుగుతున్న కీల‌క భేటీకి హాజ‌రు కాక‌పోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల నాగార్జున ఈ భేటీకి హాజ‌రు కాలేద‌ని స‌మాచారం. అయితే నంద‌మూరి హీరో ఎన్టీఆర్ హాజరు కాకపోవడానికి వ్యక్తగత కారణాలా, లేక‌ రాజకీయ కారాణాలా అనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

Exit mobile version