Tollywood: మంత్రి కోమటిరెడ్డిని కలిసిన టాలీవుడ్ ప్రముఖులు

Tollywood: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులు, సినీ నటులు పెద్దగా ముఖ్యమంత్రి రేవంత్ కానీ, మంత్రులను కానీ ఎవరినీ కలవలేదు. నిర్మాత అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ లాంటివారు మాత్రమే సోషల్ మీడియాలో విష్ మాత్రమే చేశారు. అయితే ఇటీవలనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ‘దిల్’ రాజు నేతృత్వంలో తెలుగు చిత్రసీమకు చెందిన 24 శాఖలకు చెందిన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. […]

Published By: HashtagU Telugu Desk
Komatireddy

Komatireddy

Tollywood: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులు, సినీ నటులు పెద్దగా ముఖ్యమంత్రి రేవంత్ కానీ, మంత్రులను కానీ ఎవరినీ కలవలేదు. నిర్మాత అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ లాంటివారు మాత్రమే సోషల్ మీడియాలో విష్ మాత్రమే చేశారు. అయితే ఇటీవలనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ‘దిల్’ రాజు నేతృత్వంలో తెలుగు చిత్రసీమకు చెందిన 24 శాఖలకు చెందిన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

డిసెంబర్ 21న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ పెద్దలు కలవనున్నారు. వాళ్ళకు తోడుగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా మీటింగ్ లో జాయిన్ కానున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కెఎల్ దామోదర ప్రసాద్, ‘దిల్’ రాజు, ముత్యాల రాందాసు, సి. కళ్యాణ్ లాంటివారు ఉన్నారు. ఇటీవలనే సీఎం రేవంత్ డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఒకవేళ సీఎంతో భేటీ అయితే కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉంది.

  Last Updated: 19 Dec 2023, 04:27 PM IST