టాలీవుడ్ నటి, ఐటెం బ్యూటీ హంసా నందిని క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఉల్లాసంగా, ఉత్సాహంగా హంసా క్యాన్సర్ బారిన పడటం సినీ అభిమానులకు షాక్ గురిచేసింది. సోషల్ మీడియా వేదికగా హంసా నందిని క్యాన్సర్ బారిన పడినట్టు స్పష్టం చేశారు. దీంతో ఆమె అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హంసా నందిని స్పందిస్తూ.. ‘‘మీ ఆలోచనలు, ప్రార్థనలు ప్రోత్సాహానికి ప్రతి ఒక్కరికీ పెద్ద ధన్యవాదాలు. ఈ కష్ట సమయాల్లో, మీ అపరిమితమైన ప్రేమ నన్ను మాటల్లో చెప్పలేనంతగా ఓదార్చింది. ఈ యుద్ధంలో నేను ఒంటరిగా లేనని నాకు భరోసా ఇచ్చింది. నా అభిమానులు, స్నేహితులు, కుటుంబం సోదరవర్గాల మద్దతు ఇస్తుండటం నమ్మలేని విధంగా ఉంది. నేను బలంగా ఉన్నాను’’ అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.
Hamsa Nandini: అభిమానులకు హంసానందిని ‘థ్యాంక్స్’

Hamnandini