Chalapathi Rao: టాలీవుడ్‌ లో మరో విషాదం.. నటుడు చలపతిరావు కన్నుమూత

టాలీవుడ్‌ను వరుస విషాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా సీనియర్ నటుడు చలపతిరావు (78) (ChalapathiRao) కన్నుమూశారు.

Published By: HashtagU Telugu Desk
Chalapathi Rao

Resizeimagesize (1280 X 720)

టాలీవుడ్‌ను వరుస విషాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా సీనియర్ నటుడు చలపతిరావు (78) (ChalapathiRao) కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చలపతిరావు (ChalapathiRao) మృతి చెందారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. 1944 మే 8న కృష్ణాజిల్లా బల్లిపర్రులో ఆయన జన్మించారు. చలపతిరావుకు కుమారుడు రవిబాబు, కూతుళ్లు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు. ఇతను 1200పైగా సినిమాల్లో పలు రకాల పాత్రల్లో నటించాడు. కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు చలపతిరావు. చలపతిరావు స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. నాన్న పేరు మణియ్య. అమ్మ వియ్యమ్మది పక్కనే ఉన్న మామిళ్లపల్లి. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు.

కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. రెండు రోజలు క్రితమే సీనియర్ నటుడు కైకాల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మరో నటుడిని కోల్పోవడంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. చలపతిరావు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విలక్షణ నటుడిగా చలపతిరావు మంచి గుర్తింపు ఉంది. విలన్‌గా, తండ్రిగా, వివిధ పాత్రలో చలపతిరావు నటించి మెప్పించారు.

  Last Updated: 25 Dec 2022, 11:54 AM IST