హైవేలో ప్రయాణిస్తున్న వాహనదారులకు భారీ షాక్. టోల్ టాక్స్ నిబంధనలో ఇప్పుడు మరిన్ని మార్పులు చేస్తున్నట్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వచ్చేనెల అనగా జూలై 1 నుంచి టోల్ టాక్స్ చార్జీలను పెంచనున్నట్లు తెలిపారు. టోల్ రూట్లో వెళితే మునుపటి కంటే ఎక్కువ నగదును మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీ డెహ్రాడూన్ జాతీయ రహదారిపై మరొకసారి టోల్ టాక్స్ పెంచేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
కాగా గతంలో టోల్ టాక్స్ మొత్తం మూడు సార్లు పెంచారు. దీని తర్వాత మరొకసారి జూలై 1 నుంచి 2 టాక్స్ పెంచడానికి టోల్ ప్లాజా సన్నాహాలు చేస్తోంది. అయితే ఇందుకోసం ఒక ఫ్రేమ్ వర్క్ ను సిద్ధం చేశారు. NHAI నుంచి గ్రీన్ సిగ్నల్ పొందడానికి వేసి ఉంది. NH లో మీరట్ లో శివయ్య గ్రామ సమీపంలోని పశ్చిమ యూపీ టోల్ ప్లాజా వద్ద టోల్ టాక్స్ వసూలు కింద కార్లు జీపులకు కనీసం 10 రూపాయలు బస్సు ట్రక్కులకు 15 రూపాయలు మల్టీ యాక్సిల్ వాహనాలకు 30 వరకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. సమీప గ్రామాల ప్రజలపై ప్రస్తుతం ఉన్న స్థానిక పన్నులను పెంచి ఆలోచనలో ఉన్నట్టు ఉంది.
కాగా ప్రస్తుతం ఐదు రూపాయలు ఉన్న లోకల్ టాక్స్ కాస్త 25 రూపాయల నుంచి 30 రూపాయలకు పెంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వెస్ట్రన్ టోల్ ప్లాజా నుంచి రోజుకు 30 నుంచి 35 వేల వాహనాలు వెళ్తున్నాయి. ఇక వారాంతంలో అయితే ఈ సంఖ్య 40 నేను అంతకంటే ఎక్కువ కూడా నమోదు అవుతోంది. టోల్ కంపెనీ నుంచి అందిన ప్రాతిపదిన రేట్ల ప్రకారం ఇప్పటివరకు కారు జీపులకు 110, బస్సు ట్రక్కులకు 385, మల్టీ యాక్సిల్ వెహికల్ కు 620, లోకల్ టాక్స్ 25 రూపాయలు వసూలు చేశారు. జూలై 1 నుంచి కారు జీప్ కి 120, బస్సు ట్రక్కు 400. మల్టీ యాక్సిల్ వాహనం 650, స్థానిక పన్ను 30 రూపాయలు వసూలు చేసే ఆలోచనలో ఉంది.