Site icon HashtagU Telugu

Top Today News: ఫిబ్రవరి 7 ముఖ్యంశాలు

Top Today News

Top Today News

Top Today News: టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం అమిత్‌షాతో సమావేశం అయి అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

2009లో ప్ర‌జారాజ్యం గెలిచిన సీట్లపైనే పవన్ కళ్యాణ్ గురి పెట్టారు. ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌కంగా నిలిచే ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రిలో ఎక్కువ సీట్లును గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నారు.

నల్గొండలో బీఆర్‌ఎస్‌కు పోటీగా భారీ సభకు ప్లాన్‌ చేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. లోకసభ ఎన్నికలే లక్ష్యంగా ఇరు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ 15 లోక్‌సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేస్తుంది.17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు 309 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు.

సోష‌ల్ మీడియా ద్వారా సెల‌బ్రిటీగా మారిన కుమారి ఆంటీ జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంట‌రీ రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఆమె ఓ టీవీ షోకు స్పెష‌ల్‌ గెస్ట్‌గా హాజ‌రైంది. బిగ్‌బాస్ సీజన్ 7 సెల‌బ్రిటీల‌తో సంద‌డి చేసింది.

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌ యువకుడిపై దోపీడీ దొంగలు దాడికి తెగబడ్డారు. చికాగోలో ఇండియన్‌ వెస్లియన్‌ యూనివర్సిటీలో చదువుతున్న సయ్యద్‌ మజహిర్‌ అలీ దోపిడీ దొంగల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు

ఈ రోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ రూపొందించినట్టు తెలిపారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు వేగవంతం చేశారు. అందులో భాగంగానే నిన్న సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ కంపెనీ ప్రతినిధులు సిఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు

దేశంలో పసిడి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. 10గ్రాముల 22క్యారెట్ల బంగారంపై 10 తగ్గి 57,740కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై కూడా అదే పది రూపాయలు తగ్గడంతో 62,990 పలికింది. కిలో వెండి 76000 వద్ద ట్రేడ్ అవుతుంది.

యానిమల్ బ్లాక్ బస్టర్ కావడంతో రష్మిక భారీగా రెమ్యునరేషన్ పెంచేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. నేను రెమ్యూనరేషన్ పెంచిన విషయం నాకే తెలియదు. సరే మీరు అన్నట్టే నిర్మాతలని రెమ్యూనరేషన్ పెంచమని అడుగుతానంటూ కౌంటర్ ఇచ్చింది.

Also Read: Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్‌.. రిషబ్ పంత్ మొత్తం సీజన్ ఆడేందుకు సిద్ధం..!