TBJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది. గురువారం దాదాపు 45 అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం మూడో జాబితాలో చేర్చవచ్చని తెలుస్తోంది. పార్టీల్లో టికెట్లు ఆశించి.. దక్కించుకోలేకపోయిన బలమైన నేతలను దృష్టిలో పెట్టుకుని కొన్ని స్థానాలను పెండింగులో ఉంచినట్టు సమాచారం తెలుస్తోంది. కాగా బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాపై బుధవారం ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలు కసరత్తు చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో నేతలు సమావేశం అయ్యారు. సుదీర్థ భేటీ తర్వాత బీజేపీ మూడో జాబితాను విడుదల చేశారు. గురువారం ఏక్షణమైనా బీజీప మూడో జాబితా వెలువడే అవకాశం ఉంది.
అయితే గ్రేటర్ హదరాబాద్ కు 13 మంది అభ్యర్థుల పేర్లతో సోషల్ మీడియాలో ఓ జాబితా వైరల్ అవుతోంది. ఇందులో నాంపల్లి నుంచి విక్రమగౌడ్ పేరు వినిపిస్తోంది. ఎల్బీనగర్ నుంచి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి నుంచి రవికుమార్ యాదవ్, మల్కాజిగిరి నుంచి ఆకుల రాజేందర్, ఉప్పల్ ఎన్వీఎ్‌సఎస్ ప్రభాకర్, ముషీరాబాద్ నుంచి బండారు విజయలక్ష్మి / పాపారావు, మలక్‌పేట నుంచి లింగాల హరిగౌడ్/కొత్తకాపు రవీందర్‌రెడ్డి, అంబర్‌పేట కృష్ణయాదవ్/గౌతం రావు, జూబ్లీహిల్స్ నుంచి జూటూరి కీర్తిరెడ్డి/డాక్టర్ పద్మ విరపనేనీ, సనత్‌నగర్ నుంచి మర్రిశశిధర్‌రెడ్డి, నాంపల్లి నుంచి విక్రమ్‌గౌడ్, సికింద్రాబాద్ నుంచి బండ కార్తీకరెడ్డి, కంటోన్మెంట్ నుంచి మాజీ మంత్రి శంకర్‌రావు కూతురు సుష్మిత పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి.
Also Read: Women Voters: ఆడాళ్లు మీకు జోహర్లు.. మహిళా ఓటర్లపై ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోకస్, కారణమిదే!