Site icon HashtagU Telugu

AP Liquor Shop Tenders : ద‌ర‌ఖాస్తుకు నేడే ఆఖ‌రి రోజు.. ఆ వైన్‌ షాపులకు ఒక్క దరఖాస్తేనట..!

Ap Liquor Shop Tenders

Ap Liquor Shop Tenders

AP Liquor Shop Tenders : ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలుకు సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి మద్యం దుకాణాల లైసెన్సు కోసం దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం, అంటే నేడు ముగియనుంది. తాజాగా అందించిన సమాచారం ప్రకారం, గురువారం రాత్రి 8 గంటల వరకు 65,629 దరఖాస్తులు చేరుకున్నాయి. ఇందులో, కేవలం నిన్నే 7,920 దరఖాస్తులు రికార్డుగా నమోదయ్యాయి. ఒక్క దరఖాస్తుకు నాన్-రిఫండబుల్ రూపంలో రూ. 2 లక్షల దరఖాస్తు ఫీజు విధించబడి ఉండటం వల్ల, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 1,312.58 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం తుది గడువు కావడంతో, మరో 20,000 పైగా దరఖాస్తులు రానున్నాయని వారు అంచనా వేస్తున్నారు. మొత్తం దరఖాస్తుల సంఖ్య 80,000 దాటే అవకాశం ఉందని ప్రకటించారు.

Narendra Modi : అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో ప్రధాని మోదీ భేటీ..

అయితే.. ఈ నెల 11వ తేదీన మద్యం దుకాణాల లైసెన్సు కోసం దరఖాస్తుల స్వీకరణ ముగియ నుండటంతో.. అక్టోబర్ 11వ తేదీ వరకు గడువు పెంచింది. వాస్తవానికి అక్టోబర్ 9 నాటికి సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచనలు చేసింది. అయితే మద్యం దుకాణదారులకి మరింత సమయం కావాలని కోరడం ద్వారా గడువు పెంచి ఉత్తర్వులు జారీ చేశారు.

ఒక్కో దుకాణానికి ఒక్క దరఖాస్తు

ఈ సందర్భంగా, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 80, 81 దుకాణాలకు ఒక్కొక్క దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అమరాపురంలోని 84వ దుకాణానికి కూడా ఒకే టెండర్ వచ్చింది. అలాగే, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని 8, 9 నంబర్ల దుకాణాలకు కూడా కేవలం ఒక్కరే దరఖాస్తు చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో నాలుగు దుకాణాలు (175, 182, 183, 187) ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రిలో 26, 28 నంబరు దుకాణాల పరిస్థితి కూడా ఇదే. అనంతపురం జిల్లా పామిడిలోని 66, పల్నాడు జిల్లా వెల్దుర్తిలోని 98వ దుకాణాలకు కూడా ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే అందింది. ఈ కొత్త మద్యం పాలసీ పరిధిలో మార్పులు చేపట్టడముతో, మద్యం మార్కెటింగ్‌లో తేలికపాటి మార్పులు వస్తాయని భావిస్తున్నారు.

Changes In Domestic Rules: దేశ‌వాళీ క్రికెట్‌లో భారీ మార్పులు చేసిన బీసీసీఐ