Site icon HashtagU Telugu

Bharat Bandh : ఈరోజు దేశవ్యాప్తంగా మూతపడ్డ విద్యాసంస్థలు

Bharat Bandh

Bharat Bandh

NEETతో పాటు పలు పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజీలను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బందుకు (Bharat Bandh) వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం అన్ని విద్యాసంస్థలు స్వచ్ఛదంగా తమ స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించాయి. దీంతో ఉదయం అన్ని అన్ని రోడ్ల కాస్త ఖాళీగా కనిపిస్తున్నాయి. లేకపోతే రాజు ఉదయాన్నే స్కూల్స్, కాలేజీ బస్ లతో, విద్యార్థులతో రద్దీ గా కనిపించేవి. కానీ ఈరోజు బంద్ కారణంగా కాస్త రద్దీ లేకుండా ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు నిన్ననే SFI, AISF, PDSU వంటి యూనియన్లు వెళ్లి బంద్ నోటీసులు కూడా ఇచ్చాయి. మరోవైపు TGలో నిరుద్యోగ సంఘాలు DSCని 45రోజులు వాయిదా, టెట్ నార్మలైజేషన్, జాబ్ క్యాలెండర్ ప్రకటన, గ్రూప్1 పోస్టుల్లో 1:100 నిష్పత్తి వంటి డిమాండ్లతో బంద్ కు పిలుపునిచ్చాయి. ఇక నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందని, బాధ్యతా రాహిత్యంతో పరీక్షలు నిర్వహించారని, నీట్‌ పరీక్షా లీకేజ్‌ కుంభకోణం, నీట్‌ స్కామ్‌పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని పలు స్టూడెంట్స్ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అందుకే ఈరోజు (జులై 4న తేదీన) దేశ వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంద్‌ ఐక్య విద్యార్ధి సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని, ఈ బంద్ కు అన్నీ విద్యా సంస్థల యాజమాన్యాలు బంద్‌ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Read Also : King Nagarjuna : కింగ్ నాగార్జున ఇది కరెక్ట్ టైం..!