Turkey: తానున్నానంటూ తుర్కియో ప్రజలకు… మన బీనా!

ప్రకృతి సృష్టించే విపత్తు ఎలా ఉంటుందో గతంలో జపాన్‌లో వచ్చిన వరదల్లో చూశాం. మరోసారి అలాంటి ప్రళయాన్నే తుర్కియే కంపించిపోయింది.

  • Written By:
  • Updated On - February 15, 2023 / 09:49 PM IST

Turkey: ప్రకృతి సృష్టించే విపత్తు ఎలా ఉంటుందో గతంలో జపాన్‌లో వచ్చిన వరదల్లో చూశాం. మరోసారి అలాంటి ప్రళయాన్నే తుర్కియే కంపించిపోయింది. వేలాది ప్రజలు చనిపోయారు. శవాలు దిబ్బగా భూకంప ప్రాంతాలు మారాయి. మరోవైపు వేల మంది శిథిలాల కింద చిక్కి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు భారత సైన్యానికి ఆ దేశంతో విభేదాలు గుర్తుకు రాలేదు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సామాన్యుల ఆర్తనాదాలే వినిపించాయి. ఇక్క డే మన ఆర్మీ అందిస్తోన్న సేవలు, మరీ ముఖ్యంగా ఓ అధికారిణి చూపుతోన్న ఆత్మీయతతో తుర్కి యే వాసులు కరిగిపోతున్నా రు.

ప్రపంచంలో ఏ ఆపద వచ్చిన సాయం అందించేది మెుదట భారత్‌ మాత్రమే. అది శ్రీలంకకు అయినా, బంగ్లాదేశ్‌కు అయినా నేపాల్‌కు ఇలా ఏ దేశానికి ప్రపంచంలో సాయం అందిస్తోంది భారత్‌. ఆపద అంటే పరిగెత్తుకుంటూ వస్తోంది. ప్రస్తుతం తుర్కియే, టర్కీల్లో మన సైన్యం నిత్యం సాహయక చర్యలు అందిస్తోంది. అక్కడ అందిస్తున్న సేవలపై ముఖ్యంగా ఓ అధికారిని చూపుతున్న ప్రేమ అక్కడి వారిని మంత్ర ముగ్దులను చేస్తోంది. వైరల్‌గా మారిన ఆమె చిత్రాలపై ప్రముఖ వ్యా పారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు.

భారత సైన్యం అందిస్తోన్న సాయాన్ని మెచ్చి, తుర్కి యే మహిళ ఒకరు మన సైనికురాలిని ప్రేమగా ముద్దాడిన చిత్రం ఇక్క డివారి
హృదయాలను తాకింది. ఆ అధికారిణే.. మేజర్ బీనా తివారీ. తుర్కి యే వెళ్లిన వైద్య బృందంలో బీనా ఒక్క రే మహిళ. అక్క డ భారత్ తాత్కా లికంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. సేవలు ప్రారంభించిన 24 గంటల్లోనే ఆమె స్థానికుల మనసు గెలుచుకున్నారు. 28 ఏళ్ల బీనా స్వస్థలం డేహ్రాదూన్. దిల్లీలోని ఆర్మీ కాలేజ్‌లో వైద్య విద్య చదివారు. దేశం కోసం సేవలు అందించడం ఆమె కుటుంబానికి కొత్తేం కాదు.

ఆమె తాత ఆర్మీలో సుబేదార్‌గా పనిచేయగా.. తండ్రి 16 కుమావ్ పదాతిదళంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త కూడా వైద్యుడే. ప్రస్తుతం ఆమె కల్నల్ యదువీర్ సింగ్ ఆధ్వ ర్యంలో అస్సాంలో పనిచేస్తున్నా రు. 60 పారా ఫీల్డ్ ఆస్ప త్రిలో ఆమె ఒక్క రే మహిళ. ఇటీవల భారతసైన్యం ఆమె చిత్రాన్ని షేర్ చేసి.. మేం జాగ్రత్తగా చూసుకుం టాం అని తుర్కి యే ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

తాజాగా ఆమె ఓ బాలికను కాపాడిన చిత్రాన్ని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసి.. ప్రపంచంలోనే అదిపెద్ద సైన్యాల్లో మనది ఒకటి. సహాయ చర్యల్లో ఎప్పుడూ ముందుంటుంది. ఇది భారత్ ఇమేజ్ అని ప్రశంసించారు.