Kodali Nani: పేదల బతుకులు మారాలంటే.. జగన్ గెలవాలి : కొడాలి నాని

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 06:32 PM IST

Kodali Nani: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కొడాలి నాని జోరుగా ప్రచారం చేస్తూ కూటమిపై విరుచుకుపడుతున్నారు. గురువారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఎన్నికల్లో మోసాల చంద్రబాబు… ఆయనకు వంత పాడేపెత్తందారులతో యుద్ధం చేస్తున్నామన్నారు. వాలంటీర్లు ఇంటికే రావాలన్న..పెదవాళ్ల బతుకు మరాలన్నా.. వైద్యం, వ్యవసాయం మెరుగుపడాలన్నా.. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. మేనిఫెస్టో ను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని సీఎం జగన్ మార్చేశారని కొడాలి నాని అన్నారు. 99 శాతం మేనిఫెస్టో అమలుచేసి.. 59 నెలల కాలంలో 2 లక్షల 70 వేల కోట్లు అక్క, చెల్లెమ్మలు ఖాతాలకు పంపించాం అని తెలిపారు. వివక్ష, లంచాలకు తావు లేదు.. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ బోధన, ట్యాబ్‌లు, బైలింగువల్ టెక్స్ట్ పుస్తకాలు.. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని కొడాలి నాని అన్నారు.

అమ్మ ఓడి, గోరుముద్ద, విద్య దీవెన, వసతి దీవెన.. గతంలో ఎప్పుడైనా చూశారా? అని ప్రజలను ఎమ్మెల్యే నాని ప్రశ్నించారు. అక్క చెల్లెమ్మలకు ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇల్లు.. గతంలో ఎపుడైనా జరిగాయా…. ఇవన్నీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణతేనని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు.

25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్, ఫామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష.. లాంటి కార్యక్రమాలతో ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించామన్నారు. 600 సేవలు అందించే సచివాలయం, ఇంటి ముంగిటకే పౌర సేవలు, 3 వేల పెన్షన్… గుమ్మం వద్దకే అందుతున్నాయన్నారు. 14 ఏళ్లు 3 సార్లు సీఎం అని చెప్పే చంద్రబాబు చేసిన మేలు ఒక్కటైన గుర్తుకు వస్తుందా.. అని కొడాలి నాని అన్నారు.