Tamil Naidu: తమిళనాడులో పెరుగుతున్న పెరుగు వివాదం.. పేరు మార్పుపై గందరగోళం?

ప్రస్తుతం హిందీ భాష విషయంలో కేంద్రంతో విభేదాలు కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటువంటి

  • Written By:
  • Publish Date - March 30, 2023 / 05:00 PM IST

ప్రస్తుతం హిందీ భాష విషయంలో కేంద్రంతో విభేదాలు కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటువంటి సమయంలో తాజాగా తమిళనాడులో మరొక వివాదం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో పెరుగు పేరు మార్చడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసలు ఈ పెరుగు వివాదం ఏంటి అన్న విషయానికి వస్తే..

భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఇటీవలే తమిళనాడు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కు పెరుగు పేరు పై కొన్ని ఆదేశాలను జారీ చేసింది. పెరుగు ప్యాకెట్లపై ఆంగ్లంలో ఉన్న కర్డ్ (curd) తమిళంలో తయిర్ (Tayir) పేర్లను తొలగించి దహీ(Dahi) అని హిందీలోకి మార్చాలని ఆ ఉత్తర్వుల సారాంశం. కేవలం పెరుగు విషయంలో మాత్రమే కాకుండా ఈ చీజ్ వంటి డైరీ ఉత్పత్తుల పేర్లను ఈ విధంగా మార్చాలి అని FSSAI ఆదేశించింది. తమిళనాడు పురుగు రాష్ట్రం అయినా కర్ణాటకకు కూడా ఇలాంటి ఉత్తర్వులనే పంపినట్లు సమాచారం. ఆ ఆదేశాలపై తమిళనాడులో ఆ గ్రహ మొదలయ్యింది.

FSSAI నిర్ణయాన్ని పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఏం కే స్టాలిన్ కూడా ఈ ఆదేశాలపై మండిపడ్డారు. అయితే హిందీని బలవంతంగా రుద్దాలి అన్న వారి పట్టుదల మరింత పెరుగుతూనే ఉంది. మాతృభాషల పట్ల ఇటువంటి నిర్లక్ష్యం పనికిరాదు దీనికి బాధ్యులైన వారిని దక్షిణాది శాశ్వతంగా బహిష్కరిస్తుంది అని స్టాలిన్ ధ్వజమెత్తారు. అయితే విషయం గురించి తమిళనాడులో వివాదం మరింత తీవ్రం అవుతుండడంతో FSSAI వెనక్కి తగ్గింది. పెరుగు పేరు మార్పుపై ఆదేశాలను సవరించింది.