Site icon HashtagU Telugu

Senthil Balaji: మంత్రి వి సెంథిల్ బాలాజీకి సిటీ కోర్టు షాక్

Senthil Balaji

New Web Story Copy (74)

Senthil Balaji: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీకి సిటీ కోర్టు షాకిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో రెండు రోజుల క్రితం తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సెంథిల్ బాలాజీ రిమాండ్ ముగించాలన్న అభ్యర్థనను సిటీ కోర్టు తిరస్కరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన బాలాజీని ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పేర్కొంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

కాగా ఈడీ చర్యను విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీ అరెస్ట్ వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీపై ఫైర్ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బాలాజీ అరెస్టును ఖండించారు.

Read More: Shocking: ముసలోడే కానీ మహానుభావుడు, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు!