Weight loss: అధిక బరువుతో బాధపడుతున్నారా…? ఈ సూపర్ టిప్స్ మీకోసమే..!

ఆధునిక కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. శరీర బరువును తగ్గించుకునేందుకు వారు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - February 11, 2022 / 06:30 AM IST

Weight Loss Tips: ఆధునిక కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. శరీర బరువును తగ్గించుకునేందుకు వారు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కొంతమంది ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంటే..మరికొంత మంది జిమ్ సెంటర్లలో కొవ్వు కరిగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయినా బరువు తగ్గని వారు చాలానే ఉన్నారు. ఎందుకంటే వీరు కొన్ని రకాల ఫుడ్ తినడం వల్లే బరువు పెరగడమే తప్పా…తగ్గడం అనేది ఉండదు. అందుకే అధిక బరువుతో బాధపడేవారు ముందుగా వంటగది నుంచే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎలా అంటారా…మీరు తీసుకునే కొన్ని రకాల ఫుడ్స్ మీరు బరువును పెంచేస్తాయి. అంతేకాదు…మీరు గంటలు గంటలుగా జిమ్ సెంటర్లలో ఎక్స్ సైజులు చేసినా…మీ బరువు మాత్రం తగ్గదు.

బరువు తగ్గాలి అనుకునేవారు ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ ఐదు రకాల ఫుడ్స్ అస్సలు తినకూడదు. అప్పుడే మీరు అనుకున్నట్లు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

రెడ్ మీట్:
ఇందులో ప్రొటీన్స్, ఐరన్, విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయినా కూడా తరచుగా వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు, ప్రమాదకరమైన కొన్ని క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు దీనిని తీసుకోవడం వల్ల శరీరం ఈజీగా బరువు పెరుగుతుంది. రెడ్ మీట్ కు బదులుగా ఇతర ఆరోగ్యకరమైన ఫుడ్స్ ను తీసుకున్నట్లయితే శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందించవచ్చు. సీఫుడ్స్, మొక్కల ఆధారిత ఫుడ్స్ , ఆర్గానిక్ ఫౌల్రీ ద్వారా మీ శరీరానికి కావాల్సినంత ప్రోటీన్లు, విటమిన్స్ లభిస్తాయి.

చక్కెరతో కూడిన డ్రింక్స్:
దాహం వేస్తే చాలు ఏవో డ్రింక్స్ తాగేవారు చాలా మందే ఉన్నారు. కొన్ని రకాల డ్రింక్స్ లో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది. ఇలాంటివి దాహాన్ని తీర్చడానికి ఉద్దేశించినవి కావన్న విషయాన్ని గ్రహించాలి. ఈ చక్కెర ఎక్కుమ మొత్తంలో తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. లెఫ్టిన్ నిరోధకత, ఇన్సులిన్ నిరోధకత పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు తినాలనుకున్న వాటిలో షుగర్ కాకుండా బెల్లంతో తయారు చేసినవి అయితే బాగుంటుంది.

జంక్ ఫుడ్:
జంక్ ఫడ్ జోలికి అస్సలు వెళ్లకండి. ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే ప్రాసెస్ చేసిన ఫుడ్ లేదా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం మంచిది. వీటికి బదులుగా కూరగాయలు, పండ్లు, బాదం, వాల్ నట్, సలాడ్స్ వంటివి తీసుకోవడం మంచిది.

ఆల్కహాల్:
అధిక బరువుతో బాధపడుతున్నవారు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బరువు అమాంతం పెరిగే ప్రమాదం ఉంటుంది. ఆల్కహాల్ కు బదులుగా ఫ్రూట్ జ్యూస్ లాంటివి తాగడం ఉత్తమం.

వీటన్నింటితోపాటుగా చాక్లెట్లు, స్వీట్లకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవాటిని తీసుకోవడం వల్ల బరువు ఈజీగా పెరుగుతారు. వీటికి బదులుగా డార్క్ చాక్లెట్స్ తినడం మంచిది. డార్క్ చాక్లెట్స్ తింటే గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. మానసికస్థితి కూడా మెరుగుపడేలా చేస్తుంది.