Site icon HashtagU Telugu

Life Partner: లైఫ్‌ పార్ట్‌నర్‌తో రొమాన్స్ చేసేందుకు ఈ టిప్స్ ఫాలోకండి!

Relationship (2)

Relationship (2)

కొందరికి లైఫ్‌ పార్ట్‌నర్‌తో రొమాంటిక్‌గా ఎలా ఉండలో తెలియదు. శృంగారం చేయడం వేరు, రొమాంటిక్‌గా ఉండటం వేరు. రొమాంటిక్‌గా ఉండటం అనేది ఓ కళ. దానిని సంబంధంలో ఉన్న ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. దాని వల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరగడంతో పాటు బంధం బలోపేతం అవుతుంది. కొత్తగా పెళ్లైనా, లేదా కొత్తగా రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టినా రొమాంటిక్‌గా ఉండటం తెలియకపోవచ్చు. చిలిపి పనులు చేయడం, రొమాంటిక్ మెసేజీలు పంపుకోవడం, చేతులు పట్టుకోవడం, వెనక నుండి కౌగిలించుకోవడం, రొమాంటిక్ సంజ్ఞలు చేయడం రొమాన్స్‌లో ఇలాంటివి చాలా ఉంటాయి. లైఫ్‌ పార్ట్‌నర్‌తో ఎలా రొమాంటిక్‌గా ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

సర్‌ప్రైజ్ డేట్‌లకు ప్లాన్‌ చేయాలి:

జీవిత భాగస్వామితో సమయ గడపడం చాలా ముఖ్యం. మీ లైఫ్‌ పార్ట్‌నర్‌తో టైం స్పెండ్ చేయడానికి ఏదైనా ప్లాన్ చేయండి. సర్‌ప్రైజ్‌ డేట్‌లకు తీసుకెళ్లండి. పార్క్, సినిమా, రెస్టారెంట్ లాంటివైనా పర్లేదు కానీ సర్‌ప్రైజ్‌గా ప్లాన్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న పనులే దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతాయి.

ముద్దు పెట్టుకోవడం:
ప్రతి సంబంధానికి శారీరక స్పర్శ చాలా ముఖ్యం. మీ భాగస్వామిని వారి చేయి పట్టుకోవడం ద్వారా వారికి కౌగిలింతలు ఇవ్వడం ద్వారా లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా మీ ప్రేమను వ్యక్తం చేయండి.

అభినందించాలి:
మీ భాగస్వామిని మీరు ఎంతగా అభినందిస్తున్నారో చెప్పడానికి సమయాన్ని వెచ్చించండి. ప్రేమ నోట్‌ను అందివచ్చడం, లెటర్ రాయడం లాంటి వాటి ద్వారా మీ భావోద్వేగాన్ని వారికి తెలియజేయండి.

బహుమతులు ఇవ్వాలి:
మీ భాగస్వామికి చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి. వాటి ద్వారా మీరు వారి గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటారని వారు అర్థం చేసుకుంటారు. బహుమతులు పెద్దది లేదా ఖరీదైనది కానవసరం లేదు. ఇక్కడ చూడాల్సింది బహుమతి విలువ కాదు, ప్రేమ విలువ.

ఫోన్ అతిగా వాడొద్దు:
లైఫ్ పార్ట్‌నర్‌తో ఉన్నప్పుడు పరధ్యానంగా ఉండొద్దు. మీ దృష్టి మొత్తం వారిపై ఉండేలా చూసుకోండి. ఫోన్‌ను అతిగా వాడొద్దు. ఇతర అంశాల ప్రస్తావన తీసుకురావొద్దు. వీలైనంత వరకు మీ జీవితం, మీ బంధం గురించి మాట్లాడుకోవాలి.