Site icon HashtagU Telugu

Tiktoker-Death : టిక్‌టాక్ ‘స్కార్ఫ్ గేమ్’ కు బాలిక బలి

Tiktoker Death

Tiktoker Death

Tiktoker-Death : టిక్‌టాక్ లో ‘స్కార్ఫ్ గేమ్’ ఆడుతూ 16 ఏళ్ల బాలిక మరణించింది.

‘స్కార్ఫ్ గేమ్’లో భాగంగా మెడకు స్కార్ఫ్ ను చుట్టుకున్న బాలిక .. మెదడుకు ఆక్సిజన్ అందక  చనిపోయింది. 

స్కార్ఫ్ గేమ్‌లో భాగంగా మెడకు స్కార్ఫ్ కట్టుకొని వీలైనంత ఎక్కువ సేపు ఊపిరి పీల్చుకోకుండా ఉండేందుకు ట్రై చేస్తారు. ఇలాగే చేసిన ఫ్రాన్స్‌ బాలిక క్రిస్టీ సిబాలీ డొమినిక్ గ్లోయిర్ గస్సైల్ దురదృష్టవశాత్తు ఊపిరాడక మరణించింది. జూన్ 7న బాలిక అంత్యక్రియలు చేశారు. ఆమె సకాలంలో స్కార్ఫ్ ను లూజ్ చేసి ఉంటే ప్రాణాలు నిలిచి ఉండేవని అంటున్నారు. అయినా అలాంటి డేంజరస్ గేమ్స్ జోలికి వెళ్లడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలోనూ ఎంతోమంది టిక్ టాక్ లో ఇలాంటి  గేమ్స్ ట్రై చేస్తూ మూర్ఛపోయారు. అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. కొంతమందైతే చనిపోయారు కూడా.

Also read : Tik Tok Ban in America : అమెరికాలో టిక్ టాక్ నిషేధం..?

టిక్ టాక్ లో పేరు తెచ్చుకోవాలి.. ఫేమస్ కావాలనే ఏకైక ఆశ వల్ల ఈవిధమైన డేంజరస్ గేమ్స్ ఆడుతూ ఫీట్స్ చేస్తూ ఎందరో ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు. పేరెంట్స్ పిల్లలకు సరైన గైడెన్స్ అందిస్తే తప్పకుండా ఇలాంటి రిస్కీ గేమ్స్ వ్యసనం నుంచి విముక్తి అవుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలోనూ అర్జెంటీనాకు చెందిన  12 ఏళ్ల బాలిక  మిలాగ్రోస్ సోటో ఇదే విధమైన స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయింది.