Babri Masjid Demolition: బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో అలర్ట్

బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్లాక్ డే పాటించాలని కొన్ని ముస్లిం సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో నగరంలోని సున్నిత ప్రదేశాల్లో పోలీసు బలగాలను మోహరించారు.

Babri Masjid Demolition: బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్లాక్ డే పాటించాలని కొన్ని ముస్లిం సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో నగరంలోని సున్నిత ప్రదేశాల్లో పోలీసు బలగాలను మోహరించారు. చార్మినార్ సమీపంలోని చారిత్రక మక్కా మసీదు దగ్గర , ఇతర ప్రార్థనా స్థలాల దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. వార్షికోత్సవం సందర్భంగా పాతబస్తీలోని సయీదాబాద్ ప్రాంతంలో ముస్లిం మహిళలు మంగళవారం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. మహిళలు ఉజాలే షా ఈద్గా వద్దకు చేరుకుని బాబ్రీ మసీదు పునరుద్ధరణ కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రాబోయే తరాలు బాబ్రీ మసీదును స్మరించుకుంటూనే ఉంటాయని మహిళలు అన్నారు. ఒక చోట ఒకసారి మసీదు నిర్మిస్తే అది శాశ్వతంగా మసీదుగా మిగిలిపోతుందన్నారు. ముస్లింలు బ్లాక్ డే పాటించి ప్రార్థనలు చేయాలని తెహ్రీక్-ఎ-ముస్లిం షబ్బాన్ విజ్ఞప్తి చేశారు.1992 డిసెంబర్ 6న మతవాద శక్తులు బాబ్రీ మసీదును కూల్చివేశాయని ఆ సంస్థ అధ్యక్షుడు ముస్తాక్ మాలిక్ తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఎప్పటికీ గుర్తుంటుందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Also Read: Babri Masjid Demolition: ఓల్డ్ సిటీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం