Site icon HashtagU Telugu

Tiger Skin: పులిచర్మాల స్మగ్లింగ్

tiger skin

tiger skin

పులి చర్మం విక్రయించడానికి ప్రయత్నం చేసిన ముఠాను అరెస్టు చేసినట్లు ములుగు జిల్లా పోలీసులు ప్రకటించారు. ఛత్తీస్‌ఘడ్ నుండి పులి చర్మాన్ని తెలంగాణలో అమ్మేందుకు ముఠా బయలు దేరినట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేయగా రెండు బైక్స్ పైన వస్తున్న ఐదుగురిని అనుమానించి చెక్ చేయగా వారిదగ్గర పులిచర్మం దొరికింది.

అది నిజమైన పులిచర్మమా కాదా అనే విషయాన్ని పోలీసులు ఫారెస్ట్ అధికారులతో కంఫర్మ్ చేసుకున్నారు. అది నిజమైన పులి చర్మమేనని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

వారి నుండి పులి చర్మం, మూడు సెల్ ఫోన్లు, రెండు బైక్స్ స్వాధీనం చేసుకున్నామని ములుగు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కోసం నిందితుల్ని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు మూడు పులిచర్మాలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version