Tiger Hunt: ఆసిఫాబాద్ జిల్లాలో పులి హల్ చల్.. రెండు బర్రెలు మృతి

పులి దాడి చేసిన ఘటనలో రెండు బర్రెలు చనిపోయాయి. దీంతో గ్రామస్తులు భయపడిపోతున్నారు.

  • Written By:
  • Publish Date - May 29, 2023 / 11:58 AM IST

తెలంగాణలో పులుల (Tigers) సంచారం పెరిగిపోతోంది. ఫలితంగా పలు అటవీ ప్రాంతాల్లో పులుల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా కుమురంభీం ఆసిఫాబాద్‌లోని సిర్పూర్ మండలం చిల్పెల్లి, ఇటిక్ల్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పెద్ద పులి పశువులను వేటాడింది. ఈ ఘటనలో రెండు గేదెలను చంపేసింది. దీంతో గ్రామస్తులు (Villagers) భయాందోళనకు గురయ్యారు.

అడవిలో రెండు గేదెలను గుర్తించిన అటవీ అధికారి (Forest Officer) వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. పులి సంచారాన్ని, గేదెలను చంపిన సంఘటన గురించి ప్రజలను అప్రమత్తం చేశాడు. ఈ ఘటనను సోషల్ మీడియా (Social Media) ద్వారా అవగాహన కల్పిస్తున్నాడు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు. ఒకవేళ పశువులను మేతకు తీసుకెళ్తే, కాపలాగా ఉంటూ అప్రమత్తగా ఉండాలని సూచించాడు.

Also Read: KTR Tweet: పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజే రెజర్లపై దాష్టీకం దురదృష్టకరం: కేటీఆర్