విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ (వైజాగ్ జూ)లో శనివారం జానకి అనే 22 ఏళ్ల ఆడపులి వృద్ధాప్యానికి గురై మృతి చెందినట్లు క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ఈ పులి సగటు ఆయుష్షును మించిపోయిందని సలారియా చెప్పారు. టైగర్ జానకి మరణం చాలా బాధాకరమని క్యూరేటర్ అన్నారు. 22 సంవత్సరాల వయస్సులో టైగర్ జానకి ఆరోగ్యం ఇటీవలి నెలల్లో క్షీణించిందని తెలిపారు. జానకిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, క్యూరేటర్ అది ఆహారం సరిగా తీసుకోక చనిపోయిందని క్యూరేటర్ తెలిపారు. జూలోని జంతు నిపుణులు, పశువైద్యుల బృందం యొక్క నిరంతర సంరక్షణ మరియు పర్యవేక్షణలో ఉండటంతో ఇన్ని రోజులు బ్రతకిందని తెలిపారు. జూలోని జంతు ఆరోగ్య కమిటీ జానకి కేసును సమీక్షించిందని.. పులి సగటు ఆయుర్దాయం దాటిందని వారు తేల్చారు.
Tiger janaki : వైజాగ్ జూపార్క్‌లో “టైగర్ జానకి” మృతి

Tiger