Site icon HashtagU Telugu

Tummala : తుమ్మల కాంగ్రెస్ లో చేరబోతున్నారా..?

thummala nageswara rao joins congress

thummala nageswara rao joins congress

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara rao )..కాంగ్రెస్ పార్టీ (Congress) లో చేరబోతున్నాడా..?  ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఇదే చర్చ నడుస్తుంది. రెండు రోజుల క్రితం బిఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటన లో తుమ్మల నాగేశ్వరరావు పేరు లేకపోవడం తో ఆయన అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ప్రకటన తర్వాత తుమ్మల అనుచరులు వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. బిఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని వారంతా అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుమ్మల కాంగ్రెస్ లోకి వెళ్తే బాగుంటుందని భావిస్తున్నారు.

మరోపక్క తుమ్మల సైతం ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. బిఆర్ఎస్ ను ఎంతగానో నమ్ముకుంటే..తనకు టికెట్ ఇవ్వకపోవడం పట్ల తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ తుమ్మలను తమ పార్టీ లోకి ఆహ్వానం పలుకుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి రేణుక తో తుమ్మల వర్గీయులు భేటీ అయ్యారని వినికిడి. మరో రెండు మూడు రోజులు పలు నియోజకవర్గాలలో తుమ్మల అనుచరులు సమావేశాలు జరిపి , భవిష్యత్ కార్యాచరణ ఫై ఓ నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. ఓవరాల్ గా మాత్రం తుమ్మల ను కాంగ్రెస్ లోకి వెళ్లాలని వారంతా కోరుతున్నారు. మరి తుమ్మల కాంగ్రెస్ లోకి వెళ్తారా..? లేక కేసీఆర్ ఏమైనా ఆఫర్ చేస్తాడా..? అనేది చూడాలి.

ఇక తుమ్మల రాజకీయ ప్రస్థానాన్ని ఓ సారి చూస్తే..

రాష్ట్రంలోని ప్రధాన పార్టీని ఒంటిచేత్తో మూడు దశాబ్దాల పాటు ఆయన నడిపించారు. టీడీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. తన అనుచరులను ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దారు. 1982 సెప్టెంబరులో చర్ల మండలం ఏటుపాక గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది సత్తుపల్లి నియోజకవర్గం(Sathupalli Constituency). పూర్వ సత్తుపల్లి నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన ఆయన తన రాజకీయాలను అక్కడి నుంచే ప్రారంభించారు. టీడీపీ (TDP) స్థాపించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడే ఆయనకు ఎన్టీఆర్ కాబినెట్లో స్థానం ఇచ్చారు. ఆయన 1985,1994,1999,2009 ఎన్నికల్లో టీడీపీపార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

2014లో జరిగిన ఎన్నికల్లో కూడా టిడిపి నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరాడు. అనంతరం ఆయనుకు బిఆర్ఎస్ (BRS) పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన ఆర్‌అండ్‌బీ, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. 2016లో పాలేరు ఉపఎన్నికలో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై 45,684 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో తుమ్మల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పట్టుకోల్పోలేదు సరికదా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేసి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్ లకు తుమ్మలను దూరం చేశారని తుమ్మల అభిమానులు ఆందోళన చెందారు.

కానీ ఈసారి తుమ్మల కు కేసీఆర్ ఛాన్స్ ఇస్తారని అంత అనుకున్నారు. కానీ నిన్న ప్రకటించిన బిఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ (BRS Candidates List) లో తుమ్మల పేరు ప్రకటించకపోవడం తో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Chandrayaan 3 : విక్రమ్ ల్యాండర్‌ గా మారిన స్విగ్గీ డెలివరీ ఐకాన్..