Site icon HashtagU Telugu

Telangana: సబ్సీడీ గొర్రెల పేరుతో భారీ మోసం…రూ. 8కోట్లు లూటీ..ముగ్గురు అరెస్టు..!!

Government Of Telangana Logo

Government Of Telangana Logo

తెలంగాణలో భారీ మోసం జరిగింది. ప్రభుత్వ గొర్రెల పంపిణీ పథకాన్ని ఆసరా చేసుకున్న ఓ ముఠా జనానికి కుచ్చుటోపీ పెట్టింది. ప్రభుత్వ గొర్రెల పంపిణీ పథకం కింద గొర్రెలు కొనుగోలు చేసినవారి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ పథకానికి మంచి ఆదరణ లభించింది. అదే సమయంలో ఈ పథకం ఆధారంగా జనాన్ని పెద్దెత్తున మోసం చేసిన ఘటనలు నమోదయ్యాయి.

ఇలాంటి ఘటనల్లో భాగంగా శుక్రవారం ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ గొర్రెల పంపిణీ పథకం కింద సబ్సిడీకే గొర్రెలను ఇప్పిస్తామని సజ్జ శ్రీనివాసరావు, లక్ష్మీ, కొల్లి అరవింద్ లు జనం నుంచి రూ. 8కోట్లు వసూలు చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్, యాదాద్రి జిల్లాల్లో వీరు భారీ మోసానికి పాల్పడ్డారు. వీరి మోసం గురించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముగ్గుర్నీ అరెస్టు చేశారు.